నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్ష అనుభవాలు పంచుకున్నారు. వారం రోజుల అంతరిక్ష పర్యటనకు వెళ్లిన సునీతా.. సాంకేతిక లోపం కారణంగా దాదాపు 9 నెలలు స్పేస్‌లోనే ఉండిపోవల్సి వచ్చింది. ఎట్టకేలకు ఇటీవల పుడమిని ముద్దాడారు. తాజాగా బాహ్య ప్రపంచం ముందుకు వచ్చిన ఆమె.. అంతరిక్ష పర్యటన అనుభవాలు మీడియాతో పంచుకున్నారు.
బంగారం స్మగ్లింగ్ చేస్తూ కన్నడ నటి రన్యారావు బెంగళూరు ఎయిర్‌పోర్టులో పట్టుబడింది. ఆమె వీఐపీ ప్రొటోకాల్ ఉపయోగించుకోవడంపై కర్ణాటక ప్రభుత్వం.. అదనపు ప్రధాన కార్యదర్శి గౌరవ్ గుప్తా ఆధ్వర్యంలో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. నివేదికను గత గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. తాజాగా నివేదికకు సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి ముంబై పోలీసులపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సోమవారం ముంబైలోని కునాల్ కమ్రా తల్లిదండ్రుల నివాసానికి పోలీసులు వెళ్లారు. ఈ సందర్భాన్ని ఉద్దేశించి కుమాల్ కమ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. గత 10 ఏళ్లుగా నివసించని చిరునామాకు వెళ్లి మీ సమయం వృధా చేసుకోవద్దు.. అలాగే ప్రజా ధనాన్ని వృధా చేయొద్దని ‘ఎక్స్’ ట్విట్టర్లో సెటైర్లు వేశారు.
మర్చంట్ నేవీ అధికారి సౌరబ్ రాజ్‌పుత్ హత్య కేసులో నిందితులు ముస్కాన్, సాహిల్ శుక్లాకు చౌదరి చరణ్ సింగ్ జిల్లా జైల్లో నటుడు, బీజేపీ నేత అరుణ్ గోవిల్ రామాయణం పుస్తకాలను అందజేశారు. జైల్లో మొత్తం 1.500 కాపీలను ఖైదీలకు పంపిణీ చేశారు. ‘‘ఘర్ ఘర్ రామాయణం’’ అనే కార్యక్రమంలో భాగంగా మీరట్ ఎంపీ అరుణ్ గోవిల్ ఈ విధంగా చేశారు.
ఔరంగజేబుపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఔరంగజేబు చరిత్ర తెలుసుకోవాలంటే వాట్సప్‌లో కాదని.. పుస్తకాలను చదవి చరిత్ర తెలుసుకోవాలని సూచించారు.
గోల్డ్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్. బంగారం ధరలు కొండెక్కాయి. గత వారం షాకిచ్చిన ధరలు.. ఈ వారం మరింతగా గూబ గుయిమనేలా షాకిస్తున్నాయి. సోమవారం రికార్డ్ స్థాయిలోకి బంగారం ధరలు చేరుకున్నాయి.
మర్చంట్ నేవీ అధికారి సౌరబ్ హత్య కేసులో భార్య ముస్కాన్, ప్రియుడు సాహిల్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. అయితే తాజాగా కానిస్టేబుల్‌కు ముస్కాన్ ముద్దు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో అధికారుల దృష్టికి వెళ్లడంతో సీరియస్ అయ్యారు.
ప్రధాని మోడీ ప్రైవేట్ కార్యదర్శిగా నిధి తివారీని కేంద్రం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వు జారీ చేసింది. 2022, నవంబర్ నుంచి ప్రధానమంత్రి కార్యాలయం (PMO)లో డిప్యూటీ సెక్రటరీగా నిధి తివారీ పనిచేస్తున్నారు.
ముస్లింలకు ప్రధాని మోడీ ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ సమాజంలో ఆశ, సామరస్యం, దయ, స్ఫూర్తిని పెంపొందించాలన ఆకాంక్షించారు. అన్ని ప్రయత్నాల్లో ఆనందం, విజయం కలుగుగాలని ఎక్స్ ట్విట్టర్లో పేర్కొన్నారు.