గోల్డ్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్. బంగారం ధరలు కొండెక్కాయి. గత వారం షాకిచ్చిన ధరలు.. ఈ వారం మరింతగా గూబ గుయిమనేలా షాకిస్తున్నాయి. సోమవారం రికార్డ్ స్థాయిలోకి బంగారం ధరలు చేరుకున్నాయి. నేడు తులం బంగారం ధర రూ. 710 పెరిగింది. దీంతో కొనుగోలుదారులు బంగారం కొనేందుకు జంకుతున్నారు. నేడు బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 650 పెరగడంతో రూ. 84,250 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 710 పెరగడంతో రూ. 91,910 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక బంగారంతో పాటు వెండి ధర కూడా భారీగా పెరిగింది. ఇవాళ కిలో వెండి ధర రూ. 1,13,000 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Maoist Party: కాంగ్రెస్ ప్రభుత్వంపై మావోయిస్టు పార్టీ సంచలన లేఖ