స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి ముంబై పోలీసులపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సోమవారం ముంబైలోని కునాల్ కమ్రా తల్లిదండ్రుల నివాసానికి పోలీసులు వెళ్లారు. ఈ సందర్భాన్ని ఉద్దేశించి కుమాల్ కమ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. గత 10 ఏళ్లుగా నివసించని చిరునామాకు వెళ్లి మీ సమయం వృధా చేసుకోవద్దు.. అలాగే ప్రజా ధనాన్ని వృధా చేయొద్దని ‘ఎక్స్’ ట్విట్టర్‌లో సెటైర్లు వేశారు.
ఇది కూడా చదవండి: Keerthi Suresh : బాలీవుడ్ లో మరో ఆఫర్ అందుకున్న కీర్తి సురేష్..
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేను ఉద్దేశించి శివసేనను చీల్చిన ‘ద్రోహి’ అంటూ సంబోధించారు. ఈ వ్యాఖ్యలే తీవ్ర దుమారం రేపాయి. శివసేన శ్రేణులకు ఆగ్రహాన్ని తెప్పించాయి. కునాల్ ప్రోగ్రామ్ నిర్వహించిన క్లబ్‌పై శివసేన కార్యకర్తలు దాడి చేశారు. అంతేకాకుండా కేసులు కూడా పెట్టారు. పలు స్టేషన్లలో కునాల్ కమ్రాపై కేసులు నమోదయ్యాయి. తమ ఎదుట హాజరుకావాలని ముంబై పోలీసులు రెండు సార్లు సమన్లు జారీ చేశారు. దీనికి కునాల్ కమ్రా స్పందించలేదు. ఇక మద్రాస్ హైకోర్టులో మధ్యంతర బెయిల్ లభించింది.
ఇది కూడా చదవండి: Tamanna : మరో ఐటమ్ సాంగ్‌తో రాబోతున్న తమన్నా !
అయితే కునాల్ కమ్రాను పట్టుకునేందుకు ముంబై పోలీసులు వేటాడుతున్నారు. ఇందులో భాగంగా ముంబైలోని కటారియా కాలనీలో ఉన్న ఆయన తల్లిదండ్రుల నివాసాన్ని పోలీసు బృందం సందర్శించింది. ముంబై పోలీసుల ఎదుట సోమవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ కునాల్ హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే కునాల్ తల్లిదండ్రుల నివాసానికి వెళ్లారు. ముంబై పోలీసుల తీరును తప్పుపడుతూ.. 10 ఏళ్ల నుంచి లేని ఇంటికి వెళ్లడం అవసరమా? సమయం.. ప్రజా వనరులను వృధా చేయొద్దని కునాల్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కునాల్ కమ్రా పుదుచ్చేరిలో నివాసం ఉంటున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే కునాల్ కమ్రా వ్యాఖ్యలను రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సమర్థించారు. కునాల్ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని.. ఆయనకు రాజకీయ శత్రువులు ఎవరూ లేరని వెనకేసుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Court Movie : అరుదైన రికార్డు క్రియేట్ చేసిన ‘కోర్టు’ మూవీ
Going to an address where I haven’t lived for the last 10 Years is a waste of your time & public resources… pic.twitter.com/GtZ6wbcwZn
— Kunal Kamra (@kunalkamra88) March 31, 2025