ముస్లింలకు ప్రధాని మోడీ ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ సమాజంలో ఆశ, సామరస్యం, దయ, స్ఫూర్తిని పెంపొందించాలన ఆకాంక్షించారు. అన్ని ప్రయత్నాల్లో ఆనందం, విజయం కలగాలని ఎక్స్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Minister Uttam: నేడు కాకినాడకు తెలంగాణ మంత్రి ఉత్తమ్
సోమవారం ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఈద్ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. మసీదుల్లో సందడి వాతావరణం నెలకొంది. ఒకరినొకరు ఒకరు ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. పవిత్ర రంజాన్ మాసం ముగిసిన సందర్భంగా ఈద్-ఉల్-ఫితర్ జరుపుకుంటారు. ఇది ముస్లింలకు ప్రత్యేకమైన రోజు. ఆదివారం దేశంలో ఈద్ చంద్రుడు కనిపించాడు. దీంతో సోమవారం ఈద్ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: Tirumala: తిరుమల అలిపిరి చెక్ పాయింట్ దగ్గర వ్యక్తి హల్ చల్!
ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా రాష్ట్ర ప్రజలకు ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ.. సమాజంలో సద్భావన, సామాజిక సామరస్యాన్ని మరింతగా బలోపేతం చేసేందుకు ప్రతిజ్ఞ చేయాలని అన్నారు. ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారని ముఖ్యమంత్రి కార్యాలయం సోషల్ మీడియాలో తెలియజేసింది.
Greetings on Eid-ul-Fitr.
May this festival enhance the spirit of hope, harmony and kindness in our society. May there be joy and success in all your endeavours.
Eid Mubarak!
— Narendra Modi (@narendramodi) March 31, 2025