మర్చంట్ నేవీ అధికారి సౌరబ్ హత్య కేసులో భార్య ముస్కాన్, ప్రియుడు సాహిల్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. అయితే తాజాగా కానిస్టేబుల్‌కు ముస్కాన్ ముద్దు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియోలో కానిస్టేబుల్‌తో కలిసి డ్యాన్స్ చేయడం.. అంతేకాకుండా ముద్దు పెట్టిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో సీరియస్ అయ్యారు. అసలేం జరిగిందని దర్యాప్తు చేపట్టగా.. ఏఐ ద్వారా క్రియేట్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసినట్టుగా గుర్తించారు. వీడియో తెగ వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పోస్టు చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు.
అయితే ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. పోలీసుల్ని కాకా పట్టేందుకు ముస్కాన్ మంచి స్కెచే వేసిందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇలా రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
ఈనెల ప్రారంభంలో ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో మాజీ మర్చంట్ నేవీ అధికారి సౌరబ్ రాజ్‌పుత్రను అతడి భార్య ముస్కాన్, ప్రియుడి సాహిల్ అత్యంత క్రూరంగా చంపేసి.. అనంతరం ముక్కలు చేసి ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి సిమెంట్‌తో కప్పేశారు. బాధితుడి కుటుంట సభ్యుల అనుమానంతో దుర్ఘటన వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే కోర్టులో హాజరుపరిచినప్పుడు నిందితుల్ని న్యాయవాదులు చితకబాదారు. అంతేకాకుండా జైల్లో ఆహారం కంటే.. గంజాయి అడుగుతున్నట్లుగా వార్త వెలుగులోకి వచ్చింది.