స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా కేసు ముదురుతున్నట్లుగా కనిపిస్తోంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేను ఉద్దేశించి కునాల్ కమ్రా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శివసేనను చీల్చిన ‘ద్రోహి’ అంటూ సంబోధించారు. ఈ వ్యాఖ్యలే కునాల్ కుమ్రాను ఇరకాటంలో పడేశాయి. ఆయనపై మహారాష్ట్రలోని పలు స్టేషన్లలో శివసేన కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఇక కునాల్‌పై నమోదైన కేసుల్లో భాగంగా ఆయనకు ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు.
ఓ ప్రయాణికుడు.. డాగ్‌తో కలిసి రన్నింగ్ ట్రైన్ ఎక్కుతుండగా ఊహించని పరిణామం ఎదురైంది. పెంపుడు కుక్క రన్నింగ్ ట్రైన్ ఎక్కలేక ఫుట్‌పాత్-రైలు మధ్యలో పడిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన విద్యావంతులే గాడి తప్పుతున్నారు. కావాలనే ఇలా చేస్తున్నారో..? లేదంటే పరిస్థితుల ప్రభావమో తెలియదు గానీ.. వక్రమార్గం పడుతున్నారు. తాజాగా బెంగళూరులో వెలుగుచూసిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోంది.
నిత్యానంద.. ఈ పేరు తెలియని వారుండరు. స్వయం ప్రకటిత ‘దేవుడి’గా ప్రకటించుకున్నారు. అయితే తాజాగా తమిళనాడు మీడియాలో నిత్యానంద చనిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. నిత్యానంద మేనల్లుడు సుందరేశ్వరన్ మీడియాకు సందేశం పంపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ వాతావరణం ముసురుతోంది. తమతో అణు ఒప్పందం చేసుకోకపోతే భయంకరమైన బాంబు దాడులు జరుగుతాయని ఇరాన్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు.
దేశంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతాలు ఊటీ, కొడైకెనాల్ టూరిస్టులతో కిటకిటలాడుతున్నాయి. ఓ వైపు పరీక్షల కాలం ముగియతుండడం.. ఇంకోవైపు సమ్మర్ కావడంతో చల్లదనం కోసం ఊటీకి వెళ్తున్నారు. అయితే అక్కడ అధికారులు ఆంక్షలు విధించారు. ఈ విషయం తెలియక వెళ్లిన పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అనంత్ అంబానీ.. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు. గతేడాదే అంగరంగ వైభవంగా అనంత్ వివాహం జరిగింది. రాధికా మర్చంట్ మెడలో మూడు ముళ్లు వేసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. దేశం నుంచే కాకుండా ప్రపంచ దేశాల నుంచి ప్రముఖులంతా ఈ మ్యారేజ్‌కు హాజరయ్యారు.
ఉక్రెయిన్‌లో ప్రతి ఏడాది ఆస్తుల వివరాలు ప్రకటించడం ఆనవాయితీ. ప్రభుత్వ పెద్దలు గానీ.. అధికారులు గానీ ఆస్తుల వివరాలు బహిరంగంగా వెల్లడించాలి. తాజాగా ఈ ప్రక్రియలో భాగంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ జీతం, కుటుంబ ఆదాయ వివరాలను ప్రకటించారు.
‘‘వెంకీ పెళ్లి సుబ్బి చావుకొచ్చింది’’ అంటుంటారు. ఈ సామెత ఎందుకు పుట్టుకొచ్చిందో తెలియదు గానీ.. ఈ సామెత మాత్రం అచ్చు గుద్దినట్లుగా ఆ సంఘటనకు సరిపోతుంది. అసలేమైంది?, ఈ ప్రస్తావన ఇప్పుడెందుకు వచ్చిందో తెలియాలంటే ఈ వార్త చదవండి.
మలేషియాలో భారీ విస్ఫోటనం సంభవించింది. పుత్రా హైట్స్‌లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. రాజధాని కౌలాలంపూర్ సమీపంలోని సెలంగోర్ రాష్ట్రంలోని పుత్రా హైట్స్‌లో మంగళవారం ఉదయం గ్యాస్ పైప్‌లైన్ లోపల నుంచి మంటలు చెలరేగడంతో భారీ పేలుడు సంభవించింది. దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.