ప్రధాని మోడీ ప్రైవేట్ కార్యదర్శిగా నిధి తివారీని కేంద్రం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వు జారీ చేసింది. 2022, నవంబర్ నుంచి ప్రధానమంత్రి కార్యాలయం (PMO)లో డిప్యూటీ సెక్రటరీగా నిధి తివారీ పనిచేస్తున్నారు. గతంలో విదేశాంగ మంత్రిత్వ శాఖలోనూ.. అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల విభాగంలో అండర్ సెక్రటరీగా పనిచేశారు. తాజాగా మోడీ ప్రైవేట్ కార్యదర్శిగా నిధి తివారీ నియమితులయ్యారు.
ఇది కూడా చదవండి: Bandi Sanjay: చిన్న చిన్న అమ్మాయిలను మెడలు పట్టుకుని లాక్కెళ్లారు..
నిధి తివారీ 2013 సివిల్ సర్వీసెస్ పరీక్షలో 96వ ర్యాంక్ సాధించారు. వారణాసిలోని మెహముర్‌గంజ్ వాసి. 2013లో సివిల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి ముందు వారణాసిలో అసిస్టెంట్ కమిషనర్ (కమర్షియల్ ట్యాక్స్)గా పని చేసింది. ఉద్యోగం చేస్తూనే సివిల్ పరీక్షకు సిద్ధమైంది. ఇప్పటి వరకు ప్రధానమంత్రికి ఇద్దరు ప్రైవేట్ కార్యదర్శులు ఉన్నారు. ఒకరు వివేక్ కుమార్, ఇంకొకరు హార్దిక్ సతీశ్చంద్ర షా, ఇప్పుడు మూడో ప్రైవేట్ కార్యదర్శిగా నిధి తివారీ నియమితులయ్యారు.
ఇది కూడా చదవండి: Kodali Nani: కొడాలి నానికి బైపాస్ సర్జరీ? ముంబైకి తరలించే అవకాశం..
Nidhi Tewari appointed as Private Secretary to Prime Minister Narendra Modi. pic.twitter.com/erpTlJfjfn
— Press Trust of India (@PTI_News) March 31, 2025