Triangle Love: ప్రాణం తీసిన ట్రయాంగిల్ లవ్.. ఎంబీఏ విద్యార్థిని ఆత్మహత్య
- ప్రాణం తీసిన ట్రయాంగిల్ లవ్
- ఎంబీఏ విద్యార్థిని ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది. ట్రయాంగిల్ లవ్ కారణంగా ఓ విద్యా కుసుమం రాలిపోయింది. ఈ ఘటన బెళగావిలోని నెహ్రూ నగర్‌లో చోటుచేసుకుంది.
విజయపురకు చెందిన ఐశ్వర్య ఎంబీఏ గ్రాడ్యుయేట్. కాలేజీలో చదివే సమయంలో ఆకాష్ చడచన్ అనే యువకుడ్ని ప్రేమించింది. అతడితో ప్రేమలో ఉంది. అయితే ఆకాష్ మాత్రం మరొక అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. తీవ్ర కలత చెందడంతో మార్చి 25న సాయంత్రం 6:30-7:30 గంటల మధ్య ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు.
Also Read
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
- School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్‌పై మంత్రి కీలక ప్రకటన
- IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్‌లో నిరసనలు
- iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
ఆకాష్ ప్రస్తుతం ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తు్న్నాడు. ఐశ్వర్య.. ఇంటర్న్‌షిప్ కోసం బెళగావికి వెళ్లింది. అయితే ఆకాష్.. మరొక అమ్మాయితో చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్నాడని ఐశ్వర్యకు తెలిసింది. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. అంతే ఆకాష్‌కి.. ఆమె స్నేహితురాలికి సందేశం పంపించింది. జీవితాన్ని ముగిస్తున్నట్లు సందేశంలో ఐశ్వర్య పేర్కొంది.
ఆత్మహత్యకు ముందు సీసీటీవీ ఫుటేజీలో ఐశ్వర్య దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఆ సమయంలో తన గదికి వెళ్లే ముందు స్నేహితురాలితో మాట్లాడుతుండటం కనిపించింది. ఇక మెసేజ్ అందగానే ఆకాష్ పరుగెత్తుకుంటూ వెళ్లి.. బలవంతంగా ఆమె గదిలోకి ప్రవేశించి ఐశ్వర్య ఫోన్‌లోని ఆధారాలన్నీ డిలీట్ చేశాడు.
ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆకాష్‌ను అదుపులోకి తసుకున్నారు. ఇక ఈ కేసులో ప్రమేయం ఉన్న మరో మహిళ కోసం కూడా గాలిస్తున్నారు. ఐశ్వర్య కాల్ రికార్డులను ఫోరెన్సిక్‌కు పంపించారు. మరిన్ని ఆధారాలు కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బెళగావి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. విచారణ కొనసాగుతుందని.. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందని బెళగావి పోలీసులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Peddi – Irumudi: ‘పెద్ది’ ఓడిపోయింది.. ‘ఇరుముడి’ గెలవలేకపోయింది!
-
Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
-
Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
-
Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
-
iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!