ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పరీక్షల కాలం నడుస్తోంది. ఫైనల్ ఎగ్జామ్స్ కోసం విద్యార్థులంతా సిద్ధపడుతున్నారు. ఇంకోవైపు ఫీజుల కోసం యాజమాన్యాలు తీవ్ర ఒత్తిడి పెంచుతున్నారు. పూర్తి ఫీజు చెల్లిస్తేనే పరీక్షలు రాయిస్తామని.. లేదంటే రాయిపించమని బెదిరిస్తున్నారు. దీంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు తీవ్రంగా సతమతమవుతున్నారు.
ఆర్ఎస్ఎస్ అనేది భారతీయ సజీవ సంస్కృతికి ఆధునిక అక్షయ వటవృక్షమని ప్రధాని మోడీ అభివర్ణించారు. ప్రధాని మోడీ ఆదివారం నాగ్‌పుర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. భారతీయ సంస్కృతికి, ఆధునికీకరణకు ఆర్ఎస్ఎస్ మర్రిచెట్టులాంటిదన్నారు
ప్రధాని మోడీ ఆదివారం ఛత్తీస్‌గఢ్ పర్యటనకు ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. 50 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. శనివారం సుక్మా జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. దాదాపు 18 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఇలా మూడు నెలల కాలంలో మొత్తం 100 మందికిపైగా మావోయిస్టులు చనిపోయారు.
ఢిల్లీ న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో దొరికిన నగదు వ్యవహారం కేసు పెను సంచలనంగా మారింది. అటు న్యాయస్థానాలు.. ఇటు పోలీసుల మధ్య తీవ్ర సందిగ్ధత నెలకొంది. ఇదిలా ఉంటే అగ్నిప్రమాద సమయంలో దొరికిన డబ్బుతో తనకెలాంటి సంబంధం లేదంటూ జడ్జి యశ్వంత్ వర్మ తోసిపుచ్చుతున్నారు.
బీహార్ రాష్ట్రాన్ని యూపీఏ ప్రభుత్వం నాశనం చేస్తే.. ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం అభివృద్ధి చేసి చూపించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఈ ఏడాది చివర్లో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం అమిత్ షా.. లాలూ ప్రసాద్ యాదవ్ సొంత జిల్లా గోపాల్‌గంజ్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. లాలూ ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు.
వీధుల్లో నమాజ్ చేయడంపై కేంద్రమంత్రి, ఎన్డీఏ మిత్రపక్షం నేత చిరాగ్ పాశ్వాన్ స్పందించారు. ఇటీవల వీధుల్లో నమాజ్ చేస్తే పాస్‌పోర్ట్‌లు, డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు చేస్తామని యూపీ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఆదేశాలు తీవ్ర దుమారం రేపాయి.
మయన్మార్ అధికారులకు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం సంభవించిన శక్తివంతమైన భూకంపంపై ఆరా తీశారు. అలాగే ప్రస్తుతం జరుగుతున్న సహాయ చర్యలపై కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిలిటరీ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హలాయింగ్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా మరింత ఇరాకటంలో పడుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఆయనపై మహారాష్ట్రలో మూడు కేసులు నమోదయ్యాయి. డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. షిండేను ఉద్దేశించి ‘ద్రోహి’ అంటూ సంబోధించారు.
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదన్న రాహుల్ గాంధీ ఆరోపణలను అమిత్ షా కొట్టిపారేశారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడారు.