ఎట్టకేలకు వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బుధవారం బిల్లుపై పార్లమెంట్లో వాడీవేడీగా చర్చ జరిగింది. దాదాపు 12 గంటల పాటు అధికార-ప్రతిపక్ష సభ్యులు ప్రసంగించారు.
లోక్‌సభ మాజీ ఎంపీ, బీజేపీ నేత, సూఫీ గాయకుడు హన్స్ రాజ్ భార్య రేషమ్ కౌర్(62) అనారోగ్యంతో కన్నుమూశారు. బుధవారం ఆమె దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా ఆమె తుది శ్వాస విడిచారు.
జపాన్‌లో భూకంపం సంభవించింది. క్యుషులో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. బుధవారం సాయంత్రం 7:34 గంటలకు 6.2 తీవ్రతతో కూడిన శక్తివంతమైన భూకంపం సంభవించింది. దీంతో జనాలు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్ట వివరాలు ఇంకా వెల్లడించలేదు.
నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ సాధారణ స్థితికి వచ్చేశారు. ఇందుకు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలే నిదర్శనం. పెంపుడు కుక్కలతో జాలిగా గడిపారు. కుక్కలు కూడా చాలా సందడిగా.. ఆనందంగా కనిపించాయి. చాలా రోజులవ్వడంతో మీద.. మీద పడి ముద్దులు పెట్టాయి.
ఆడదానికి ఆడదే శత్రువు అంటుంటారు. ఏ ఉద్దేశంతో ఈ సామెత ఎందుకు పుట్టుకొచ్చిందో తెలియదు గానీ.. రష్యాలో ఒక మహిళ వ్యవహరించిన తీరుకు ఈ సామెత అచ్చు గుద్దినట్లుగా సరిపోతుంది. ఆపదలో ఉన్న మహిళల పట్ల జాలి పడాల్సిన సాటి మహిళ.. క్రూరత్వాన్ని ప్రదర్శించింది.
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపారు. మెక్సికో సరిహద్దులో సైన్యాన్ని దింపి అక్రమ వలసలకు అడ్డుకట్ట వేశారు. అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన అనేక దేశాల ప్రజలను పట్టుకుని తిరిగి పంపించేశారు. ఇందులో భారత పౌరులను కూడా తిరిగి పంపించేసింది.
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా పూనమ్ గుప్తా నియమితులయ్యారు. ఏప్రిల్ 7-9 తేదీల్లో జరగనున్న కీలకమైన ద్రవ్య విధాన కమిటీ సమావేశానికి ముందే పూనమ్ గుప్తా డిప్యూటీ గవర్నర్ బాధ్యతలు చేపట్టనున్నారు.
ముడా కుంభకోణం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు చుక్కెదురైంది. ఈ కేసులో సిద్ధరామయ్య నిర్దోషి అంటూ లోకాయుక్త ఇచ్చిన నివేదికను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తోసిపుచ్చింది. లోకాయుక్త పోలీసుల దర్యాప్తు నివేదికను ఈడీ సవాల్ చేసింది. లోకాయుక్త నివేదికను కొట్టివేయాలంటూ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
సామాజిక కార్యకర్త మేధా పాట్కర్‌కు మరోసారి చుక్కెదురైంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే.సక్సేనా పరువు నష్టం కేసులో విధించిన శిక్షను రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు బుధవారం కొట్టేసింది. మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఇచ్చిన నిర్ణయాన్ని ఢిల్లీ కోర్టు సమర్థించింది.
గాజాలో మరోసారి ఇజ్రాయెల్ దళాలు సైనిక ఆపరేషన్ మొదలు పెట్టాయి. బుధవారం భారీ స్థాయిలో ఐడీఎఫ్ దళాలు మోహరించినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ తెలిపారు. హమాస్‌ను నిర్మూలించి.. బందీలను తిరిగి తీసుకొస్తామని చెప్పారు. అందుకు ప్రజలు సహకరించాలని కోరారు.