Anasuya Bharadwaj: మహిళల దుస్తులు, సంప్రదాయాలపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. దండోరా సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ మాట్లాడుతూ.. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించడమే మంచిదని, రివీలింగ్ డ్రెస్‌లు సరికావని, ‘సామాన్లు ప్రదర్శించడం’ వంటి అభ్యంతరకర భాష ఉపయోగించారు. ఈ వ్యాఖ్యలు మహిళలను అవమానించేలా ఉన్నాయని పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఈ నేపథ్యంలో ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ శివాజీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన వీడియోలో అనసూయ తన అసహనాన్ని వ్యక్తం చేసింది. ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. నిన్న బట్టల స్టోర్ లాంచ్ కాబట్టి, బట్టల షాప్ అంటే ఫ్యాషన్ అన్నారు కాబట్టి నేను దాని గురించి మాట్లాడిన తర్వాత జర్నలిస్ట్ అడిగారని అన్నారు. అలా పేరు తీసుకొని మీ జవాబు ఏంటంటే నేను చెప్పాను. అందుకు నాకు అనిపించింది నేను చెప్పానని ఆమె అన్నారు.
Child Trafficking : పసికందుల దందాలో పేరున్న హాస్పిటల్స్.. షాకింగ్ రిపోర్ట్.!
దీనితో ఆయన ఈరోజు ఒక్కళ్లే సీట్ వేసుకుని విక్టిమ్ ప్లే చేస్తున్నారని ఆమె అన్నారు. ఇది ‘నార్సిసిస్ట్’కి ఉండే లక్షణం ఇది. ఓకే చాలా మందికి నార్సిసిస్ట్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కొంచెం చూడండని ఆమె అన్నారు. ఆ ఒక మిసోజనిస్టిక్ చాతగాని తనంతో ఎప్పుడు అంటే ప్రపంచంలో చాలా జరుగుతున్నాయి.. ఇప్పుడు నన్ను చాలా మంది అన్నారు కూడా.. నేనైనా, చిన్మయ్య గారైనా, ఫెమినిస్ట్లు వీళ్ళందరూ వచ్చేస్తుంటారు.. ఫేక్ ఫెమినిస్టులు అని అన్నారని చెప్పుకొచ్చింది. అసలు ఫేక్ ఫెమినిజం అనేది లేదండి, ఫెమినిజం అంటే ఏంటి ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమానమైన హక్కులు ఉండాలి అన్ని విధాలా అని అనేవాళ్ళు చాలా మంది అబ్బాయిలు కూడా ఫెమినిస్ట్లు ఉంటారని అనసూయ అన్నారు.
ఈ బట్టల గురించి ఏదైతే మాట్లాడుతూ వస్తున్నారో ఇదంతా చాతగానితనం. సెల్ఫ్ కంట్రోల్, ఇన్సెక్యూరిటీస్ మళ్ళీ చెప్తున్నా ఇన్సెక్యూరిటీ, సెల్ఫ్ కంట్రోల్ లేని వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద రుద్దుతూ ఉంటారు కంట్రోల్ ని.. వాళ్ళకి కంట్రోల్ లేనప్పుడు వేరే వాళ్ళని కంట్రోల్ చేయాలని చూస్తూ ఉంటారున్నమాట. అదే ఇప్పుడు క్లియర్ కట్ సినారియో. అందుకే నేను ఇంకా సింపతైజ్ చేస్తున్నాను. ఈరోజు కూడా పాపం సింపతీ గ్యాదర్ చేసుకుని కూర్చుంటున్నారు కాబట్టి, నేను సింపతీటిక్ గానే ఉంటాను. పాపం ఆయనకు అదే కావాలి కాబట్టి అదే ఇస్తున్నాను.
Aravalli Hills: ఆరావళి పర్వతాల్లో మైనింగ్‌పై కేంద్రం సంచలన నిర్ణయం..
నేనెందుకు అందులో లాగాను మిమ్మల్ని ఏమన్నా అన్నానా.. అంటే నేను కూడా హీరోయినే.. నేను కూడా ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్. ఒకటో రెండు చేశాను. మీరు హీరోయిన్ అని అంటున్న సందర్భాల్లో ఆడవాళ్ళు ఇలా బట్టలు వేసుకోవాలి. ఇక్కడిదాకా ఓకే సార్. మిమ్మల్ని నేను చెప్తున్నానా మీరు ఈ బట్టలు వేసుకోమని ఎవరైనా ఆ హీరోయిన్లు మీతో అంటున్నారా..? నేను పర్సనల్ గా చెప్తున్నాను. చాలా మంది హీరోయిన్స్ నన్ను అప్రిషియేట్ చేస్తారు. ఆ బలంతో నెగిటివ్ గా అయితే ఎప్పుడు నేను ఉపయోగించుకోలేదు. ఆ బలాన్ని పాజిటివ్ గానే ఇలాంటి సందర్భంలో చెప్తున్నా.. మీరు మా అందరికీ బట్టలు వేసుకోవాలి అనే చిన్న పిల్లలం కాదు.. మేము మా హక్కులు మాకు తెలుసు, మా ఇష్టాలు మమ్మల్ని జీవించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం సార్.. మీకు కూడా చాలా వినమ్రతతో చెప్తున్నాను. మీరు నన్ను లాగలేదు కానీ కలెక్టివ్ గా లాగారు.
నేను ఒకడ ఆడదాన్ని.. నేను గ్లామరస్ గా అందంగా ఉండాలనుకునేదాన్ని. నాకు ఇష్టమైనట్టుగా నచ్చినట్టుగా బట్టలు వేసుకోవాలనుకొని చాలా మంది ఫీమేల్ యాక్టర్స్ లాగే నేను కూడా ఉన్నాను. కాబట్టి నా ఒపీనియన్ అడిగినప్పుడు నేను చెప్పాను సర్. మీరు ఏదైతే చాలా బల్లగుద్ది ధైర్యంగా చెప్పగలుగుతున్నారో.. మీరు చాలా తెలివి గలవాళ్ళు అనుకుంటే, మీరు ఒక్కళ్లే అలా ఉంటే సృష్టికర్తలైన మేము మాకు ఇంకెంత బుర్రు ఉంటుంది అనుకుంటున్నారు.
బయట ప్లాట్ఫామ్ ఇవన్నీ యాక్షన్ అన్నప్పుడే ఉండాలి. బయట మనం వచ్చింది నిన్న నిన్ననో మొన్ననో జరిగింది మొన్న ఆ టోన్ ఏదైతే ఉండిందో సర్ మీది అది మీ అసలు స్వరూపం మీరు కన్సర్న్ ప్రొటెక్షన్ పేరుతో నిజంగానే మీకు ఆడవాళ్ళ అంటే కన్సర్న్ ఇలా పాపం హీరోయిన్స్ అట్టా వెళ్ళినప్పుడు అలా అలా వాళ్ళు ప్రొటెక్షన్ కోసం అని అనుకుంటే మీకే గనుక నిజంగా ఆ ఇంటెన్షన్ ఉండి ఆ నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మగవాళ్ళకి చెప్పండి. ఒరేయ్ ఏంట్రా అది అడవి జంతువుల్లాగా మీద పడడం ఆ అమ్మాయి అంత అందంగా ఉంది చూడండి. అప్రిషియేట్ హర్ బ్యూటీ రెస్పెక్ట్ హర్ బౌండరీస్ అని నేర్పించండి. ఆడవాళ్ళకి అవి వేసుకొని వెళ్ళొద్దు సర్ నాకు నాకు అర్థం కాదు బట్టలు ఇలా వేసుకోవాలి అలా వేసుకోవాలని చెప్పాలి అలా వేసుకొని ఇలా వేసుకోవాలిని ఎక్కడ రాసింది సార్ మీరు చెప్పండని ఆమె అన్నారు.