మర్చంట్ నేవీ అధికారి సౌరబ్ రాజ్‌పుత్ హత్య కేసులో నిందితులు ముస్కాన్, సాహిల్ శుక్లాకు చౌదరి చరణ్ సింగ్ జిల్లా జైల్లో నటుడు, బీజేపీ నేత అరుణ్ గోవిల్ రామాయణం పుస్తకాలను అందజేశారు. జైల్లో మొత్తం 1.500 కాపీలను ఖైదీలకు పంపిణీ చేశారు. ‘‘ఘర్ ఘర్ రామాయణం’’ అనే కార్యక్రమంలో భాగంగా మీరట్ ఎంపీ అరుణ్ గోవిల్ ఈ విధంగా చేశారు. ఈ సందర్భంగా ‘జై శ్రీరామ్’ నినాదాలతో ఆయనకు స్వాగతం పలికారు.
ఇది కూడా చదవండి: Former CM Atishi: ఢిల్లీలో విద్యుత్ కోతలు పెరిగాయి.. బీజేపీపై మాజీ సీఎం ఫైర్
టెలివిజన్ సిరీస్ ‘రామాయణం’లో రాముడి పాత్ర పోషించినందుకు గోవిల్ ప్రసిద్ధి చెందారు. దేశవ్యాప్తంగా 11 లక్షల రామాయణ కాపీలను పంపిణీ చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపారు. 45 రోజుల క్రితం హాపూర్‌లో ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు11,000 కాపీలు పంపిణీ చేసినట్లు గోవిల్ తెలిపారు. రామాయణం చదివి ఖైదీల్లో మార్పు రావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఈనెల ప్రారంభంలో ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో మాజీ మర్చంట్ నేవీ అధికారి సౌరబ్ రాజ్‌పుత్రను అతడి భార్య ముస్కాన్, ప్రియుడి సాహిల్ అత్యంత క్రూరంగా చంపేసి.. అనంతరం ముక్కలు చేసి ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి సిమెంట్‌తో కప్పేశారు. బాధితుడి కుటుంట సభ్యుల అనుమానంతో దుర్ఘటన వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే కోర్టులో హాజరుపరిచినప్పుడు నిందితుల్ని న్యాయవాదులు చితకబాదారు. అంతేకాకుండా జైల్లో ఆహారం కంటే.. గంజాయి అడుగుతున్నట్లుగా వార్త వెలుగులోకి వచ్చింది.
ఇది కూడా చదవండి: Minister Nadendla Manohar: యువత కోసం పవన్ కల్యాణ్ తపన.. ఉత్తరాంధ్రకు భారీ పెట్టుబడులు వస్తాయి..!