వైద్యులు.. దేవుడితో సమానం అంటారు. దేవుడు మనిషిని చేస్తే.. వైద్యం చేసి ప్రాణాలు నిలబెట్టేది డాక్టర్లు. అందుకే రోగులు.. వైద్యులకు దండాలు పెడతారు. దేవుడితో సమానంగా చూస్తారు కాబట్టే.. అంతగా వారిని గౌరవిస్తారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? అయితే ఈ వార్త చదవాల్సిందే.
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కత్తిపోటు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నటుడి ఇంట్లో దొరికిన వేలిముద్రలు.. నిందితుడు షరీఫుల్ ఇస్లాం షెహాజాద్తో సరిపోవడం లేదని పోలీసులు తేల్చి చెప్పారు. న్యాయస్థానంలో పోలీసులు సమర్పించిన ఛార్జ్‌షీట్‌లో ఈ మేరకు పేర్కొన్నారు.
కర్ణాటకలో 6 లక్షల ట్రక్కులు సమ్మెలోకి దిగాయి. దీంతో నిత్యావసర సామాగ్రి నిలిచిపోయాయి. ఇక సమ్మెకు 24 రాష్ట్రాల నుంచి రవాణాదారులు మద్దతు ప్రకటించారు. పాలు తరలించే ట్రక్కులు తప్ప.. మిగిలిన అన్ని ట్రక్కులు రోడ్లపైకి రావని రవాణా సంఘాలు తెలిపాయి.
నేపాల్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.0గా నమోదైంది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) తెలిపింది. ఎన్సీఎస్ ప్రకారం..ఈ భూకంపం 25 కి.మీ లోతులో సంభవించిందని వెల్లడించింది.
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో దూసుకెళ్తోంది. సుంకాలను 90 రోజులు ట్రంప్ వాయిదా వేశారు. ఈ నిర్ణయం ఇన్వెస్టర్లలో నూతనోత్సహాన్ని నింపింది. దీంతో అమెరికా మార్కెట్‌తో పాటు ఆసియా మార్కెట్లు భారీ లాభాలు అర్జిస్తున్నాయి.
హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ సర్కార్ గట్టి షాకిచ్చింది. యూనివర్సిటీకి అందించే 2.2 బిలియన్ డాలర్ల ఫెడరల్ నిధులను నిలిపివేసింది. హార్వర్డ్ యూనివర్సిటీ యూదు మతానికి వ్యతిరేకంగా పని చేస్తోందని.. హమాస్ మద్దతుగా కార్యకలాపాలు కొనసాగిస్తుందని వైట్‌హౌస్ ఆరోపించింది.
బీహార్‌లో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి మధ్య టఫ్ ఫైట్ ఉండనున్నట్లు కనిపిస్తోంది.
ఇరాన్‌ను మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అణ్వాయుధాల ప్రస్తావన ఇరాన్ మరిచిపోవాలని.. లేదంటే అణు స్థావరాలపై మిలిటరీ చర్య ఉంటుందని హెచ్చరించారు. న్యూక్లియర్ ఒప్పందం చాలా దగ్గరకు వచ్చినప్పటికీ ఇరాన్ కావాలనే తాత్సారం చేస్తోందని ఆరోపించారు.
వక్ఫ్ చట్టంపై సుప్రీం ధర్మాసనం జోక్యం చేసుకోదని మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ అంశంపై కేంద్రమంత్రి స్పందించారు. శాసనసభ విషయాల్లోకి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోదని విశ్వాసం వ్యక్తం చేశారు.
అంబేద్కర్ జయంతి రోజున హర్యానాలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. సోమవారం ప్రధాని మోడీ హర్యానాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఒక అభిమానిని ప్రధాని మోడీ కలిశారు. అంతేకాదు.. ఆ అభిమానికి స్వయంగా మోడీనే పాదరక్షలు తొడిగించారు.