దేశంలో ఉగ్రదాడులు జరగొచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ మేరకు రైల్వేశాఖను అప్రమత్తం చేశాయి. డ్రోన్, ఐఈడీతో దాడులు జరగవచ్చని సూచించాయి. తాజాగా పశ్చిమ బెంగాల్లో హింస చెలరేగింది.
దేశంలో ఎక్కడైనా బాయ్స్ హాస్టల్లోకి అమ్మాయిలు అనుమతి ఉండదు.. అలాగే ఉమెన్స్ హాస్టల్లోకి అబ్బాయిలకు అనుమతి ఉండదు. చాలా కఠినంగా నిబంధనలు అమలు చేస్తుంటారు. అలాంటిది ఒక విద్యార్థి.. గుట్టుచప్పుడు కాకుండా.. ఎవరికీ అనుమానం తలెత్తకుండా సరికొత్త ఉపాయం ఆలోచించాడు.
త్వరలోనే బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి తలపడనున్నాయి. ఇప్పటికే రెండు దశాబ్దాలకు పైగా నితీష్ కుమార్ నాయకత్వంలో ప్రభుత్వం నడుస్తోంది.
దేశ రాజధాని ఢిల్లీని దుమ్ము తుఫాన్ బెంబేలెత్తించింది. శుక్రవారం ఊహించని రీతిలో ఈదురుగాలులు హడలెత్తించాయి. దీంతో చెట్లు నేలకూలాయి. శుక్రవారం సాయంత్రం మొదలైన దుమ్ము తుఫాన్ అర్ధరాత్రి వరకు బీభత్సం సృష్టించింది.
జమ్మూ కాశ్మీర్‌లోని అఖ్నూర్ సెక్టార్లో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు ప్రయత్నాన్ని భారత సైన్యం తిప్పికొట్టింది. ఈ కాల్పుల్లో ఒక సైనికుడు మృతిచెందాడు.
విద్యావంతులు పది మందికి ఆదర్శంగా ఉండాలని పెద్దలు చెబుతుంటారు. కానీ అందుకు భిన్నంగా నేటి విద్యావంతుల ప్రవర్తన ఉంటుంది. పబ్లిక్ ప్లేస్‌లో ఉన్నామన్న ఇంకిత జ్ఞానం లేకుండా ఓ జంట జుగుప్సాకరంగా ప్రవర్తించారు. అందరూ చూస్తుండగానే రాసలీలల్లో మునిగిపోయారు.
వక్ఫ్ చట్టం అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి పశ్చిమబెంగాల్ అట్టుడుకుతోంది. గత కొద్ది రోజులుగా ఆందోళనలు, నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితుల్ని గమనించిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఎట్టి పరిస్థితుల్లో బెంగాల్లో వక్ఫ్ చట్టం అమలు చేయబోమని తేల్చి చెప్పారు
మాజీ రెజ్లర్ వినేష్ ఫోగట్‌కు హర్యానా రాష్ట్ర క్రీడా విభాగం బహుమానం ప్రకటించింది. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండడంతో మూడు ఆప్షన్లు ఇచ్చింది. నగదు మరియు నివాసం లేదా గ్రూప్ ఏ ప్రభుత్వ ఉద్యోగం.. ఇలా మూడు ఆప్షన్లు ఇచ్చింది.
తమిళనాడు బీజేపీ చీఫ్‌గా అన్నామలై వారసుడిగా నైనార్ నాగేంద్రన్ రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెన్నైలో పర్యటిస్తున్నారు. అన్నామలై వారసుడిని అధికారికంగా శనివారం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
తమిళనాడు మంత్రి కె.పొన్ముడి హద్దులు దాటి ప్రవర్తించారు. తన స్థాయి మరిచి నీచానికి ఒడిగట్టారు. పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన మంత్రే.. స్థాయి మరిచి జోక్‌లు వేశారు. పబ్లిక్ మీటింగ్‌లో స్త్రీ, పురుషులు ఉన్నారన్న ఇంకిత జ్ఞానం లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడారు.