వక్ఫ్ చట్టం అమల్లోకి వచ్చాక పశ్చిమ బెంగాల్లో గత కొద్ది రోజులుగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తీవ్ర స్థాయిలో హింస చెలరేగింది. ముర్షిదాబాద్, దక్షిణ 24 పరగణాలు, మాల్డా, హుగ్లీతో సహా ఇతర జిల్లాల్లో హింస చెలరేగింది.
రాజస్థాన్ పర్యటనలో లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీకి వింత పరిస్థితి ఎదురైంది. సవాయి మాధోపూర్‌లోని రణతంబోర్ జాతీయ ఉద్యానవనానికి రాహుల్‌గాంధీ వెళ్తుండగా సడన్‌గా కారు ఆపి.. కాంగ్రెస్ కార్యకర్త చుట్టన్ లాల్ మీనాను పలకరించారు.
రోజురోజుకు దేశంలో నేరాలు-ఘోరాలు పెరిగి పోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్లలో మాత్రం మార్పు రావడంతో లేదు. ఏదొక చోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ ఘోరం వెలుగులోకి వచ్చింది.
ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంలో మరోసారి దుబాయ్ విమానాశ్రయం చోటు దక్కించుకుంది. తాజాగా ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల టాప్ 10 జాబితాను ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వెల్లడించింది.
పాకిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.8గా నమోదైంది. శనివారం మధ్యాహ్నం 1 ఒంటి గంటకు వచ్చిన భూప్రకంపనలకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆస్తి, ప్రాణ నష్టాలకు సంబంధించిన వివరాలు రాలేదు.
చైనాను ప్రచండ గాలులు బీభత్సం సృష్టించాయి. శనివారం భారీ గాలులు వీచడంతో రాజధాని బీజింగ్‌లో చెట్లు కూలిపోగా.. పాత ఇళ్లులు ధ్వంసం అయ్యాయి. భారీగా దుమ్ము తుఫాన్ చెలరేగగా.. పార్కులు మూసేశారు. ఇక భీకర గాలులు కారణంగా వందలాది విమాన సర్వీసులు రద్దయ్యాయి.
దేశ చరిత్రలో తొలిసారి రాష్ట్రపతి, గవర్నర్ అనుమతి లేకుండా 10 బిల్లులు ఆమోదం పొందాయి. తమిళనాడుకు చెందిన పెండింగ్ బిల్లులు ఆమోదించినట్లుగా ఇటీవల దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. తాజాగా తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
దుమ్ము తుఫాన్ కారణంగా శుక్రవారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. దాదాపుగా 205 విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఎట్టకేలకు ఇరాన్ దిగొచ్చింది. అమెరికాతో అణు ఒప్పందం చేసుకొనేందుకే సిద్ధపడింది. అమెరికాతో న్యాయమైన అణు ఒప్పందం చేసుకోవడానికి ఎదురుచూస్తున్నట్లు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సన్నిహితుడు అలీ షమ్ఖానీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.