‘దండోరా’ సినిమా ఈవెంట్‌లో హీరోయిన్ల దుస్తులపై నటుడు శివాజీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు టాలీవుడ్‌లో పెద్ద చిచ్చు రేపాయి. ఈ వ్యవహారంపై మహిళా కమిషన్ సీరియస్ అవ్వడం, శివాజీ ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పినప్పటికీ వివాదం సద్దుమణగడం లేదు. తాజాగా ఈ అంశంపై సింగర్ చిన్మయి సోషల్ మీడియా వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు. లూలూ మాల్‌లో వేధింపులకు గురైన నటినే తప్పుబట్టడం అత్యంత దిగ్భ్రాంతికరమని ఆమె పేర్కొన్నారు. బాధితురాలి దుస్తులను సాకుగా చూపిస్తూ నేరస్తుల ప్రవర్తనను సమర్థించడం, సమాజంలో పాతుకుపోయిన స్త్రీ ద్వేషానికి నిదర్శనమని చిన్మయి మండిపడ్డారు. అంతే కాదు..
Also Read : Allu Arjun-Lokesh : లోకేశ్‌తో బన్నీసీక్రెట్ మీటింగ్.. మూవీ ఫిక్స్ అవుతుందా?
శివాజీ వివరణ ఇస్తున్న కొద్దీ ఇండస్ట్రీలో మహిళలకు రక్షణ లేని వాతావరణం ఉందనే విషయం మరింత స్పష్టమవుతోందని చిన్మయి ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులకు పురుషుల ప్రవర్తనే కారణమని అంగీకరించకుండా, మహిళల ప్రవర్తనను వేలెత్తి చూపడం నేరాన్ని ప్రోత్సహించడమేనని ఆమె అభిప్రాయపడ్డారు. ఇలాంటి బాధ్యతారహితమైన మాటల వల్లే బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్పుకోవడానికి భయపడుతున్నారని, ఇది కేవలం ఒక్క నటికే కాకుండా మొత్తం మహిళా వర్గానికే అవమానమని ఆమె తన పోస్ట్‌లో స్పష్టం చేశారు. చూడబోతే.. ఈ విషయం ఇప్పట్లో ముగిసేలా లేదు.