ఓ ప్రేమజంటకు అలహాబాద్ హైకోర్టు షాకిచ్చింది. తల్లిదండ్రుల్ని ఎదురించి వివాహం చేసుకున్న జంటకు రక్షణ కల్పించలేమని న్యాయస్థానం తేల్చి చెప్పింది. పోలీస్ రక్షణను హక్కుగా డిమాండ్ చేయరాదని.. ఒకవేళ నిజమైన బెదిరింపు అయితే పోలీసులు రక్షణ కల్పిస్తారని అలహాబాద్ హైకోర్టు తీర్పు వెలువరించింది.
ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో దారుణం జరిగింది. 11 ఏళ్ల మూగ, చెవిటి బాలికపై అత్యాచారం జరిగింది. బాలిక మంగళవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం వెతికారు.
తమిళనాడులో వచ్చే ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తు్న్నారు. ఇలాంటి తరుణంలో టీవీకే పార్టీ అధినేత, నటుడు విజయ్ ఇరాకటంలో పడ్డారు.
ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్కు చెందిన స్వప్న అనే మహిళ కాబోయే అల్లుడితో పారిపోయింది. 10 రోజుల్లో పెళ్లి అనగానే అల్లుడితో జంప్ అయిపోయింది. తాజాగా వీళ్లిద్దరూ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా స్వప్న ఎందుకు వెళ్లిపోవల్సి వచ్చిందో పోలీసులకు వివరించింది.
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణంగా జరిగింది. కేన్సర్ బాధితుడు తన భార్యను తుపాకీతో కాల్చి చంపి అనంతరం తనకు తానుగా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాసి ప్రాణాలు తీసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హార్వర్డ్ యూనివర్సిటీపై చర్యలకు ట్రంప్ సర్కార్ రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే యూనివర్సిటీకి అందించే 2.2 బిలియన్ డాలర్ల ఫెడరల్ నిధులను నిలిపివేసింది. తాజాగా విశ్వవిద్యాలయానికి ఇస్తున్న పన్ను మినహాయింపును కూడా రద్దు చేయాలని రెవెన్యూ ఏజెన్సీకి ట్రంప్ ఆదేశించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బీఆర్ గవాయ్ నియమితులయ్యారు. ప్రస్తుత చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 13న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో తదుపరి చీఫ్ జస్టిస్‌గా గవాయ్ పేరును కొలీజియం ప్రాతిపాదించింది.
గత కొద్ది రోజులుగా బెంగాల్ అట్టుడుకుతోంది. వక్ఫ్ చట్టాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ముస్లింలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. పలు చోట్ల హింస చెలరేగడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయాలయ్యాయి.
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ పేర్లను ఈడీ ఛార్జ్‌షీట్‌లో పొందుపరిచింది. తాజాగా ఈ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజకీయ ప్రతీకారానికి పాల్పడుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
గాజా సరిహద్దు సమీపంలోని ఇజ్రాయెల్ ప్రజలు నివాసం ఉండే ప్రాంతంలో ఐడీఎఫ్ ఫైటర్ జెట్ బాంబు దాడి జరిగింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో ఐడీఎఫ్ దళాలు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే ఈ దాడి కేవలం సాంకేతిక లోపంతో జరిగినట్లుగా ఇజ్రాయెల్ తెలిపింది.