బీహార్‌లో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి మధ్య టఫ్ ఫైట్ ఉండనున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే రెండు దశాబ్దాలుగా నితీష్ కుమార్ ప్రభుత్వం నడుస్తోంది. మరోసారి అధికారం కోసం బీజేపీ నేతృత్వంలో వ్యూహాలు రచిస్తోంది.
ఇది కూడా చదవండి: Physical Harassment: తిరుపతి శిల్పారామంలో లైంగిక వేధింపుల కలకలం
అయితే ఈసారి నితీష్ కుమార్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా పక్కన పెట్టాలని బీజేపీ భావిస్తోంది. ఎలాగైనా ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవాలని కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు కూడా రచిస్తున్నట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సామ్రాట్ చౌదరి.. కాబోయే బీహార్ ముఖ్యమంత్రి అంటూ ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు పొలిటికల్‌గా సంచలనం రేపుతున్నాయి. నితీష్ కుమార్‌ను పక్కన పెడుతున్నారని చెప్పడానికి ఈ వ్యాఖ్యలు నిదర్శనంగా మారాయి.
ఇది కూడా చదవండి: Mahesh Babu : ఖలేజా రీ-రిలీజ్.. కొందరి దుష్ప్రచారం
హర్యానా ముఖ్యమంత్రి ఆదివారం గుర్గావ్‌లో సామాజిక సంస్కర్త మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. బీజేపీ విజయయాత్ర హర్యానా నుంచి బీహార్ వరకు కొనసాగాలని.. బీహార్‌లో సామ్రాట్ చౌదరి విజయ పతాకాన్ని ఎగురవేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సామ్రాట్ చౌదరి కాబోయే బీహార్ ముఖ్యమంత్రిగా పేర్కొన్నారు.
ఇక హర్యానా సీఎం వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ స్పందించారు. ఎన్డీఏ నాయకుల మద్య అంతర్గత పోటీ ఉందని.. చాలా మంది ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారని వ్యాఖ్యానించారు. నితీష్ కుమార్ 20 ఏళ్ల పాలనను పాత వాహనంతో పోల్చారు. దానిని మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Trump: ఇరాన్‌కు మళ్లీ ట్రంప్ హెచ్చరిక.. అణ్వాయుధాల ప్రస్తావన మరిచిపోవాలని వార్నింగ్