బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కత్తిపోటు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నటుడి ఇంట్లో దొరికిన వేలిముద్రలు.. నిందితుడు షరీఫుల్ ఇస్లాం షెహాజాద్‌తో సరిపోవడం లేదని పోలీసులు తేల్చి చెప్పారు. న్యాయస్థానంలో పోలీసులు సమర్పించిన ఛార్జ్‌షీట్‌లో ఈ మేరకు పేర్కొన్నారు. ఇటీవలే 1,600 పేజీల ఛార్జ్‌షీట్‌ను పోలీసులు కోర్టులో సమర్పించారు.
ఇది కూడా చదవండి: Crime News: దుబాయ్‌లో దారుణం.. పాకిస్తానీ చెతిలో తెలంగాణకు చెందిన ఇద్దరు హత్య
2025, జనవరి 16వ తేదీ తెల్లవారుజామున ముంబైలోని సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడిన వ్యక్తి అతనిపై పలుసార్లు కత్తితో దాడి చేశాడు. సంఘటన తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో జరిగింది. మహిళా సిబ్బందిపై దాడి జరిగిన తర్వాత నటుడు శబ్దాలు విని అడ్డుకున్నాడు. దీంతో దొంగ-నటుడి మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో సైఫ్ అలీ ఖాన్ తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటినా సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: Earthquake: నేపాల్‌లో భూకంపం.. తీవ్రత 4.0గా నమోదు
అయితే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని నటుడి ఇంట్లో వేలిముద్రలు సేకరించారు. సీసీ కెమెరాను పరిశీలించారు. ఫ్లాట్‌లోని వివిధ ప్రాంతాల్లో 20 వేలిముద్రల నమూనాలను కనుగొన్నట్లు ఛార్జిషీట్‌లో పేర్కొంది. దీంతో అనుమానితుడు బంగ్లాదేశ్‌కు చెందిన షెహజాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే దర్యాప్తులో అతడి వేలిముద్రలతో నమూనాలు సరిపోవడం లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఫోరెన్సిక్ రిపోర్టులో వేలిముద్రలు సరిపోవడం లేదని తేల్చి చెప్పింది. అయితే నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధంతో మాత్రం సరిపోతుందని ముంబై కోర్టుకు తెలియజేశారు.
ఇది కూడా చదవండి: US: హార్వర్డ్ యూనివర్సిటీకి ట్రంప్ సర్కార్ షాక్.. నిధులు నిలిపివేత