హర్యానాలో సభ్యసమాజం తలదించుకునే ఘటన వెలుగు చూసింది. అచేతన స్థితిలో చికిత్స పొందుతున్న ఓ మహిళా రోగిపై ఆస్పత్రి సిబ్బంది అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. ఐసీయూలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘోరం గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చోటుచేసుకుంది.
వక్ఫ్ చట్టం అమల్లోకి వచ్చాక బెంగాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హింస చెలరేగి నలుగురు ప్రాణాలు కోల్పోగా.. పదుల కొద్దీ గాయాలు పాలయ్యారు. ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ముర్షిదాబాద్‌లో హింసాత్మక ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి.
భార్యాభర్తల మధ్య సంబంధాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. ప్రియుడి మోజులో పడి కట్టుకున్నవాడినే కడతేరుస్తున్నారు. కలకాలం తోడుండాల్సిన వాళ్లే.. అర్థాంతరంగా కాటికి పంపిస్తున్నారు. ఆ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే వలసదారుల్ని కట్టడి చేశారు. ఇక అక్రమంగా అమెరికాలో ఉంటున్న వలసదారులకు తాజాగా ట్రంప్ ప్రత్యేక ఆఫర్ ప్రకటించారు.
వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను బుధవారం దేశ సర్వోన్నత న్యాయస్థానం విచారించనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారించనుంది.
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. కొండగావ్-నారాయణ్‌పూర్ సరిహద్దులో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్ట్ అగ్ర నేతలను భద్రతా దళాలు హతమార్చాయి.
ఆప్ఘనిస్థాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.9గా నమోదైంది. బుధవారం ఉదయం 4:43 గంటలకు హిందూకుష్ ప్రాంతంలో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ(ఎన్సీఎస్) అధికారులు తెలిపారు.
మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఎమ్మెల్యే గోలు శుక్లా కుమారుడు రుద్రాక్ష శుక్లా రెచ్చిపోయాడు. దేవాస్‌లోని ఒక కొండపై ఉన్న ప్రసిద్ధ మాతా టేక్రీ ఆలయాన్ని మూసేసిన తర్వాత అర్ధరాత్రి సమయంలో వచ్చి పూజారిపై దాడి చేశాడు.
స్కూల్ ఫీజుల పెంపును ఏ మాత్రం సహించబోమని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా హెచ్చరించారు. ఫీజుల పెంపును నిరసిస్తూ తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. దీంతో మోడల్ టౌన్‌లోని క్వీన్ మేరీ స్కూ్ల్ యాజమాన్యం పిల్లల్ని వేధించడం ప్రారంభించింది.
ఇద్దరు వివాహితులు పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరం కాదని కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇరువురికి వైవాహిక స్థితి గురించి తెలిశాక.. సమ్మతితో సెక్స్ సంబంధం పెట్టుకోవడం ఏ మాత్రం నేరం కాదని పేర్కొంది. ఏకాభిప్రాయంగా పరిగణించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు.