నేపాల్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.0గా నమోదైంది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది. ఎన్‌సీఎస్ ప్రకారం..ఈ భూకంపం 25 కి.మీ లోతులో సంభవించిందని వెల్లడించింది. దీని ప్రభావం కారణంగా భూప్రకంపనలు చోటుచేసుకోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆస్తి, ప్రాణ నష్టం గురించి ఎలాంటి వివరాలు తెలియజేయలేదు. ఈ భూకంపం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రపంచంలో భూకంపాలు సంభవించే దేశాల్లో నేపాల్ 11వ స్థానంలో ఉంది. ఇది హిమాలయాల వెంబడి ఉంటుంది. దీంతో ఎక్కువగా నేపాల్‌లో భూకంపాలు సంభవిస్తుంటాయి. ఇక్కడ భారత్-యురేషియన్ టెక్టోనిప్ ప్లేట్లు ఢీకొంటాయి. దీంతో క్రస్ట్‌లో ఒత్తిడి ఏర్పడి భూకంపాలు సంభవిస్తుంటాయి.
ఇటీవల మయన్మార్, థాయ్‌లాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. దీంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది క్షతగాత్రులయ్యారు. ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే మయన్మార్‌కు భారత్ అండగా నిలిచింది. నిత్యావసర వస్తువులను పంపించింది.
ఇది కూడా చదవండి: Mallu Bhatti Vikramarka: మహిళా అభివృద్ధే లక్ష్యం.. స్త్రీ సమ్మిట్ 2.0లో డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
EQ of M: 4.0, On: 15/04/2025 04:39:02 IST, Lat: 28.76 N, Long: 82.01 E, Depth: 25 Km, Location: Nepal.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjcVGs @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/S3eH4nkb7Q— National Center for Seismology (@NCS_Earthquake) April 14, 2025