గత కొద్ది రోజులుగా బెంగాల్ అట్టుడుకుతోంది. వక్ఫ్ చట్టాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ముస్లింలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. పలు చోట్ల హింస చెలరేగడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయాలయ్యాయి. ఇక పోలీస్ బలగాలు రంగంలోకి దిగి లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు. అయినా కూడా అక్కడక్కడ అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక నిరసనకారులు వాహనాలను తగలబెట్టారు.
ఇది కూడా చదవండి: Ajinkya Rahane: అందుకే నేను రివ్యూ తీసుకోలేదు.. అసలు విషయం చెప్పిన రహానే!
ఇదిలా ఉంటే ముర్షిదాబాద్ హింసలో మరణించిన ముగ్గురు వ్యక్తుల కుటుంబానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సాయం ప్రకటించారు. రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాను మమత ప్రకటించారు. ఇక అల్లర్లు కారణంగా వందలాది హిందూ కుటుంబాలు ఇళ్లను వదిలి వేరే చోట ఆశ్రయం పొందుతున్నారు. ఇక హింసకు పాల్పడిన 150 మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: US-China Trade Conflict: చైనాపై అమెరికా ఆగ్రహం.. 245 శాతానికి పెంచిన దిగుమతి సుంకం
ఇదిలా ఉంటే వక్ఫ్ చట్టాన్ని బెంగాల్‌లో అమలు చేయబోమని ఇప్పటికే సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. కానీ అల్లర్లు ఆగలేదు. తాజాగా బుధవారం నేతాజీ ఇండోర్ స్టేడియంలో ముస్లిం మతాధికారులు, ఇమామ్‌లు, ముజ్జిన్‌లు, ముస్లిం మేధావులతో మమతా బెనర్జీ అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల బాధ్యతను కోల్‌కతా మేయర్, ముస్లిం సమాజానికి చెందిన సీనియర్ టీఎంసీ నేత ఫిర్హాద్ హకీమ్‌కు అప్పగించారు. శాంతిని నెలకొల్పేందుకు ముస్లిం పెద్దలతో మమత చర్చించనున్నారు.
ఇది కూడా చదవండి: Jagadish Reddy: ఏపీ ప్రభుత్వం అక్రమంగా నీళ్లు తీసుకెళ్తుంది.. మాజీమంత్రి హాట్ కామెంట్స్