నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ పేర్లను ఈడీ ఛార్జ్‌షీట్‌లో పొందుపరిచింది. తాజాగా ఈ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజకీయ ప్రతీకారానికి పాల్పడుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అంతేకాకుండా కాంగ్రెస్ కార్యకర్తలు దేశ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అయితే కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ ఖండిస్తోంది. చట్టం తన పని తాను చేసుకునిపోతుందని బీజేపీ చెప్పుకొచ్చింది.
ఇది కూడా చదవండి: KTR: సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతించిన బిఆర్ఎస్ పార్టీ
తాజాగా బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ ఘాటు విమర్శలు చేశారు. నేషనల్ హెరాల్డ్ పత్రికను గాంధీ కుటుంబం తమ ప్రైవేట్ ఏటీఎంగా వాడుకున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి నిరసన తెలిపే హక్కు ఉంది. కానీ.. ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేసి నేషనల్ హెరాల్డ్‌కు ఇచ్చే హక్కు లేదన్నారు. స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న ప్రజల గొంతును బలోపేతం చేయడానికి ఏర్పాటు చేసిన ఈ వార్తా పత్రికను గాంధీ కుటుంబం తమ ప్రైవేట్ ఏటీఎంగా వాడుకున్నారని ఆరోపించారు. ఈ కేసును కొట్టివేయించడానికి సోనియాగాంధీ, రాహుల్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ విఫలమయ్యాయన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని.. అక్రమాలకు పాల్పడినవారు తప్పించుకోవడానికి ఇది కాంగ్రెస్ పాలన కాదని తెలిపారు.
ఇది కూడా చదవండి: Shreyas Iyer-Chahal: చహల్‌కు శ్రేయస్ దిశానిర్దేశం.. ఏం చెప్పాడంటే?
ఇక రవిశంకర్ ప్రసాద్ విమర్శలను కాంగ్రెస్ తిప్పికొట్టింది. కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ మాట్లాడుతూ.. ఈ కేసు రాజకీయ ప్రేరేపితమని అన్నారు. మేము న్యాయ వ్యవస్థను విశ్వసిస్తామని.. దీనిపై మేము చట్టబద్ధంగా పోరాడి న్యాయం పొందుతామని చెప్పారు. ప్రతిపక్షాల గొంతును అణిచివేయడానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. మోడీ ప్రభుత్వానికి ఎటువంటి ఆధారాలు లేవని.. కేవలం ప్రతిపక్షాల ప్రతిష్టను దిగజార్చాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Pastor Praveen Pagadala: ప్రవీణ్ పగడాల మృతిపై సీబీఐ విచారణ కోసం పిల్.. హైకోర్టు కీలక ఆదేశాలు
#WATCH | Delhi | On ED's prosecution complaint against Rahul Gandhi, Sonia Gandhi and others in alleged National Herald money laundering case, BJP MP Ravi Shankar Prasad says, "Congress party has the right to protest, but it does not have the right to misappropriate government… pic.twitter.com/t2mbQknwPY
— ANI (@ANI) April 16, 2025