ఈ మధ్య భార్యాభర్తల సంబంధాలు ఘోరంగా దెబ్బతింటున్నాయి. సోషల్ మీడియా ప్రభావమో.. లేదంటే సినిమాల ప్రభావమో తెలియదు గానీ.. కలకాలం తోడుండాల్సిన భాగస్వాములను అర్థాంతరంగా వదిలించుకుంటున్నారు.
అమెరికాలో ఒక వ్యక్తి విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించాడు. కత్తితో బెదిరించి తన అధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో ప్రయాణికుడి అప్రమత్తమై తన దగ్గర ఉన్న లైసెన్స్ గన్‌తో కాల్పులు జరపడంతో దుండగుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఇటలీ ప్రధాని మెలోనీ గురువారం అమెరికాలో పర్యటించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మెలోనీ సమావేశమై సుంకాలపై చర్చించారు. అన్ని దేశాలపై ట్రంప్ భారీగా సుంకాలు పెంచేశారు. దీంతో ప్రపంచ మార్కెట్లు ఘోరంగా దెబ్బ తిన్నాయి.
అగ్ర రాజ్యం అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పులతో దద్దరిల్లింది. ఫ్లోరిడా యూనివర్సిటీ రక్తసిక్తమైంది. మాజీ విద్యార్థి జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. దీంతో అప్రమత్తం అయిన పోలీసులు.. నిందితుడిని చాకచాక్యంగా పట్టుకున్నారు.
పూణె-బెంగళూరు హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. వోల్వో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రాణభయంతో ప్రయాణికులు కిందకు దూకేశారు. మహారాష్ట్రలోని పూణె జిల్లా ఖేడ్ శివపూర్ సమీపంలో ఘటన చోటుచేసుకుంది.
కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత వచ్చే వారం అమెరికాకు వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు అగ్ర రాజ్యంలో పర్యటించనున్నట్లు కాంగ్రెస్ ప్రచార విభాగం అధిపతి పవన్ ఖేరా తెలిపారు. ఏప్రిల్ 21, 22 తేదీల్లో రోడ్ ఐలాండ్‌లోని బ్రౌన్ విశ్వవిద్యాలయంలో రాహుల్ ప్రసంగించనున్నారు
వామ్మో.. మీరట్‌లో మరో దారుణం వెలుగుచూసింది. మొన్నటికి మొన్న భర్తను ప్రియుడి సాయంతో అత్యంత దారుణంగా చంపేసి.. అనంతరం ముక్కలు.. ముక్కలు చేసి ప్లాస్టిక్ డ్రమ్ములో సిమెంట్‌తో కప్పేశారు. ఈ దారుణాన్ని ఇంకా మరువక ముందే మరో ఘోరం మీరట్‌లో వెలుగుచూసింది.
బెంగాల్ ఉపాధ్యాయులకు దేశ సర్వోన్నత న్యాయస్థానం తీపికబురు చెప్పింది. కొత్తగా ఉద్యోగుల్ని నియమించేంత వరకు ఉపాధ్యాయులుగా కొనసాగవచ్చని సుప్రీం ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది.
కాశ్మీర్‌పై పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో నివసిస్తున్న పాకిస్తానీయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ అసిమ్ మునీర్ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. కాశ్మీర్ తమ జీవనాడి అని.. దానిని మరిచిపోలేమని వ్యాఖ్యానించారు.
మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రా వరుసగా మూడో రోజు ఈడీ కార్యాలయానికి వచ్చారు. ప్రియాంకతో కలిసి విచారణ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా రాబర్ట్ వాద్రా కీలక వ్యాఖ్యలు చేశారు. విచారణలో అధికారులు అడుగుతున్న ప్రశ్నలపై అసహనం వ్యక్తం చేశారు.