UP: కాబోయే అల్లుడితో జంప్ అయిన ఎపిసోడ్‌లో అత్త తాజా ట్విస్ట్ ఇదే!
- కాబోయే అల్లుడితో జంప్ అయిన ఎపిసోడ్‌లో తాజా ట్విస్ట్ ఇదే!
- రాహుల్‌తోనే తన జీవితం అని స్వప్న వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌కు చెందిన స్వప్న అనే మహిళ కాబోయే అల్లుడితో పారిపోయింది. 10 రోజుల్లో పెళ్లి అనగానే అల్లుడితో జంప్ అయిపోయింది. తాజాగా వీళ్లిద్దరూ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా స్వప్న ఎందుకు వెళ్లిపోవల్సి వచ్చిందో పోలీసులకు వివరించింది. తన భర్త రోజు మద్యం తాగొచ్చి కొట్టేవాడని.. అంతేకాకుండా కుమార్తె కూడా తరచుగా గొడవ పడేదని.. దీంతో విసుగెత్తి కాబోయే అల్లుడు రాహుల్‌తో పారిపోయినట్లుగా చెప్పింది. ఇక జీవితం రాహుల్‌తోనే అని తెగేసి చెప్పింది. ఇంట్లో ఏమి తీసుకుని వెళ్లలేదని ఆమె చెప్పుకొచ్చింది. కేవలం మొబైల్, రూ.200 తీసుకెళ్లినట్లు చెప్పింది. ఇక రాహుల్ మాట్లాడుతూ.. చచ్చిపోతానని బెదిరించడంతోనే ఆమెతో వెళ్లినట్లుగా చెప్పుకొచ్చాడు. రాహుల్‌నే పెళ్లి చేసుకుంటానని ఆమె పదే పదే చెబుతుంటే.. అతడు మాత్రం దాటవేత ధోరణిలో కనిపించాడు.
ఇది కూడా చదవండి: Bhumana Karunakar Reddy: గోశాలకు వెళ్లేందుకు భూమనకు పోలీసుల అనుమతి!
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
స్వప్న-రాహుల్ ఏప్రిల్ 6న ఇంట్లో నుంచి పారిపోయారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాలు షాక్‌కు గురయ్యాయి. తన భార్య స్వప్న రోజు రాహుల్‌తో ఫోన్‌లో మాట్లాడుతుండేదని భర్త జితేంద్ర కుమార్ ఆరోపించాడు. గంటల తరబడి మాట్లాడేదని పేర్కొన్నాడు.
తాను చెప్పిన చోటికి రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని స్వప్న బెదిరించిందని రాహుల్ పేర్కొన్నాడు. భయపడే ఆమెతో వెళ్లినట్లు వాపోయాడు. అలీఘర్ బస్టాప్‌లో కలవాలని ఫోన్ చేసి బెదిరించిందని చెప్పుకొచ్చాడు. మొదట లక్నోకు.. అక్కడ నుంచి ముజఫర్‌పూర్‌కు వెళ్లినట్లు చెప్పుకొచ్చాడు. పోలీసులు వెతుకుతున్నారన్న సమాచారంతో పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లుగా రాహుల్ తెలిపాడు. స్వప్నను పెళ్లి చేసుకుంటారా? అని అడిగితే మాత్రం అలాంటిదేమీ లేదన్నాడు. కొద్దిసేపటి తర్వాత చూస్తాను అంటూ దాటవేశాడు.
ఇక స్వప్న తమకు వద్దని.. తీసుకెళ్లిన నగలు, నగదు ఇచ్చేయాలని కుటుంబ సభ్యులు కోరారు. అంతేకాకుండా ఆమెపై చర్య తీసుకోవాలని ఆమె సోదరుడు దినేష్ డిమాండ్ చేశాడు. భర్త కొడుతున్నాడన్న వార్తలను అతడు ఖండించాడు. నెలల తరబడి స్వప్న ఇంట్లో ఉన్నానని.. అలాంటి ఘటనలు ఎప్పుడూ చూడలేదని దినేష్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ కేసుపై పోలీసులు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
ఇది కూడా చదవండి: Baahubali 1 : ప్రపంచ యాత్రలో మరో ఘట్టానికి చేరుకున్న ‘బాహుబలి’
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!