Trump: హార్వర్డ్ యూనివర్సిటీకి ట్రంప్ సర్కార్ భారీ షాక్!
- హార్వర్డ్ యూనివర్సిటీకి ట్రంప్ సర్కార్ భారీ షాక్!
- పన్ను మినహాయింపు రద్దు చేయాలని నిర్ణయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హార్వర్డ్ యూనివర్సిటీపై చర్యలకు ట్రంప్ సర్కార్ రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే యూనివర్సిటీకి అందించే 2.2 బిలియన్ డాలర్ల ఫెడరల్ నిధులను నిలిపివేసింది. తాజాగా విశ్వవిద్యాలయానికి ఇస్తున్న పన్ను మినహాయింపును కూడా రద్దు చేయాలని రెవెన్యూ ఏజెన్సీకి ట్రంప్ ఆదేశించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ట్రంప్ ప్రభుత్వం ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్)ను కోరినట్లుగా నివేదిక అందుతోంది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: STR 49 : శింబు సినిమాలో కమెడియన్ గా ‘సంతానం’
Also Read
- Pickaxe Mountain: 'త్వరలో పికాక్స్ పర్వతంపై దాడి చేస్తాం' ఇరాన్ కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..
- Kailash Mansarovar Yatra 1981: కైలాసానికి దారి మూసేసిన చైనా.. తెరిపించిన సుబ్రహ్మణ్యస్వామి.. 1981 నాటి ఆసక్తికర కథ..
- Fitna al-Hindustan: ఇండియానే టార్గెట్ చేస్తోన్న పాకిస్థాన్.. ‘ఫిత్నా అల్-హిందుస్తాన్’ పేరుతో కొత్త కుట్ర?
- Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
హార్వర్డ్ యూనివర్సిటీ యూదు మతానికి వ్యతిరేకంగా పని చేస్తోందని.. హమాస్ మద్దతుగా కార్యకలాపాలు కొనసాగిస్తుందని ఇటీవల వైట్‌హౌస్ ఆరోపించింది. జో బైడెన్ పదవీకాలంలో అమెరికాలోని అనేక యూనివర్సిటీల్లో హమాస్‌కు మద్దతుగా ఆందోళనలు జరిగాయి. ఇక హార్వర్డ్ యూనివర్సిటీ అయితే ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌నకు వ్యతిరేకంగా పని చేసిందని కూడా ఆరోపణలు ఉన్నాయి. దీంతో హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్ సర్కార్ కత్తి కట్టినట్లుగా కనిపిస్తోంది.
విశ్వవిద్యాలయాలకు పన్ను మినహాయింపు తొలగింపు అనేది చాలా అరుదుగా జరుగుతోంది. అలాంటిది హార్వర్డ్ యూనివర్సిటీ విషయంలో మాత్రం ట్రంప్ చర్యలకు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు అధికారులకు ట్రంప్ సూచన ఇచ్చారు. రాజకీయ, సైద్ధాంతిక, ఉగ్రవాద ప్రేరేపిత మద్దతు గల విశ్వవిద్యాలయానికి పన్ను మినహాయింపు ఇవ్వడం ఏ మాత్రం భావ్యం కాదని.. తక్షణమే రద్దు చేయాలని ట్రంప్ సూచించినట్లుగా సమాచారం.
ఇది కూడా చదవండి: Bhu Bharathi: నేడు భూ భారతి పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
అయితే ట్రంప్ ఆదేశాలపై ఇప్పటి వరకు హార్వర్డ్ యూనివర్సిటీ ఇంకా స్పందించలేదు. నిజంగా పన్ను మినహాయింపును రద్దు చేస్తే ఇది చాలా అసాధారణమైన చర్యగా చెప్పొచ్చు. ఇలాంటి చర్య 1980లో జరిగింది. జాతి వివక్షత కారణంగా ఒక క్రైస్తవ కళాశాలకు పన్ను మినహాయింపును రద్దు చేశారు. ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీ విషయంలో కూడా అదే జరగబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
సాధారణంగా పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థలు వంటి లాభాపేక్షలేని సంస్థలకు పన్ను మినహాయింపులు ఉంటాయి. కానీ వారు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు తేలితే మాత్రం ఆ హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే హార్వర్డ్ యూనివర్సిటీ 2024లో ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌నకు వ్యతిరేకంగా పని చేసినట్లుగా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హార్వర్డ్ యూనివర్సిటీకి పన్ను మినహాయింపు రద్దు చేసే యోచనలో ట్రంప్ సర్కార్ పని చేస్తోంది.
ఇది కూడా చదవండి: Off The Record : ఆ BJP నేత భయపెట్టి మరీ బర్త్ డే విషెస్ చెప్పించుకున్నారా?
తాజావార్తలు
-
Oppo A7 Pro: ఒప్పో A7 Pro లాంచ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్, IP69K రేటింగ్!
-
AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
-
KAAKA: మెగా అభిమానులకు మాస్ ట్రీట్.. సంక్రాంతి రేసులోనే చిరు! క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
-
Top 7 Indian Sequels: ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 7 సీక్వెల్స్ ఇవే!
-
Pickaxe Mountain: ‘త్వరలో పికాక్స్ పర్వతంపై దాడి చేస్తాం’ ఇరాన్ కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!