ఉత్తరప్రదేశ్‌లో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించిన కొన్ని గంటలకే రాష్ట్రంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. అలీగఢ్ విశ్వవిద్యాలయంలో నడకకు వెళ్లిన ఉపాధ్యాయుడి తలపై రెండుసార్లు కాల్చడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన యూనివర్సిటీలో తీవ్ర కలకలం రేపింది.
ఇది కూడా చదవండి: Nitin Gadkari: హమాస్ నేత ఇస్మాయిల్ హనియే హత్య మిస్టరీపై గడ్కరీ కీలక వ్యాఖ్యలు
ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో ఏబీకే హైస్కూల్‌లో కంప్యూటర్ సైన్స్ బోధించే డానిష్ రావు.. ఇద్దరు సహోద్యోగులు బుధవారం సాయంత్రం నడకకు వెళ్లారు. కబుర్లు చెప్పుకుంటూ సాగిపోతుండగా రాత్రి 8:50 గంటల సమయంలో కాల్పుల శబ్దాలతో మార్మోగింది. స్కూటర్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. సమీపం నుంచి తలపై రెండు, మూడు సార్లు కాల్పులు జరిపారు. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో క్యాంపస్ అంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం దుండగులు పరారయ్యారు.
ఇది కూడా చదవండి: Tamil Nadu Video: రన్నింగ్ ట్రైన్ నుంచి జారిపడ్డ మహిళ.. సిబ్బంది ఏం చేశారంటే..!
డానిష్ రావును వెంటనే జవహర్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీకి తరలించినట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నీరజ్ జాడోన్ తెలిపారు. ఆస్పత్రికి చేరుకునేలోపే ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. విశ్వవిద్యాలయంలోని సెంట్రల్ లైబ్రరీ సమీపంలో ఈ కాల్పులు జరిగినట్లు తెలిపారు. ఆరుగురు పోలీసు బృందాలు ఏర్పాటు చేశామని, తప్పించుకున్న హంతకులను గుర్తించడానికి సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రతి వ్యక్తికి భద్రతా ముఖ్యమని… ప్రతి వ్యక్తికి మెరుగైన భద్రతా వాతావరణం ఉండడంతోనే యూపీకి పెట్టుబడులు వస్తున్నాయని ముఖ్యమంత్రి యోగి అసెంబ్లీలో అన్నారు. కానీ కొన్ని గంటలకే ఈ కాల్పులు జరగడం తీవ్ర కలకలం రేపింది.