Gambhir vs Rohit: జైపూర్ వేదికగా జరిగిన విజయ్ హజారే ట్రోఫీ 2025-26 మ్యాచ్‌లో భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మరోసారి తన క్లాస్ బ్యాటింగ్ అంటే ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాడు. బుధవారం నాడు సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో సిక్కింపై ముంబై జట్టు తరఫున బరిలోకి దిగిన ‘హిట్‌మ్యాన్’.. కేవలం 94 బంతుల్లో 155 పరుగులు చేసి అభిమానులకు క్రిస్మస్ వేడుకలను ముందే అందించాడు. ఇక, రోహిత్ ఇన్నింగ్స్‌లో 18 ఫోర్లు, 9 సిక్సర్లు ఉండగా.. మైదానం మొత్తం బౌండరీల మోత మోగింది. తన ట్రేడ్‌మార్క్ స్ట్రోక్స్‌తో బౌలర్లపై విరుచుకు పడిన రోహిత్.. చేజింగ్‌లో విధ్వంసం సృష్టించాడు. 237 పరుగుల లక్ష్యాన్ని ముంబై జట్టు చాలా అలవోకగా ఛేదించి, 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంకా 117 బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించేశాడు హిట్ మ్యాన్.
Read Also: Shambala : అలాంటి పాత్ర దొరకడం నా అదృష్టం – అర్చన అయ్యర్
అయితే, ఈ మ్యాచ్ ద్వారా రోహిత్ తన 37వ లిస్ట్-A సెంచరీని నమోదు చేసుకున్నాడు. కానీ, ఈ ఇన్నింగ్స్ కేవలం గణాంకాలుకు మాత్రమే పరిమితం కాలేదు. అభిమానులకు అది ఓ బ్యాటింగ్ కచేరీలా అనిపించింది. హిట్‌మ్యాన్ ఆటను కళ్లారా చూడటానికి 20 వేల మందికి పైగా క్రికెట్ లవర్స్ స్టేడియానికి తరలివచ్చారు. మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ సమయంలో బీసీసీఐ సెలెక్టర్ ఆర్‌పీ సింగ్‌ను గుర్తించిన అభిమానులు.. జాతీయ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను టార్గెట్ చేస్తూ నినాదాలు చేశారు. “గంభీర్ కిధర్ హై, దేఖ్ రహా హై నా?” (గంభీర్ ఎక్కడ? చూస్తున్నావా?) అంటూ ఫ్యాన్స్ గట్టిగా అరవడంతో స్టేడియం ఒక్కసారిగా హీటెక్కింది. ఈ నినాదాలు అప్పటికే మ్యాచ్‌ను మరింత ఉర్రూతలూగించాయి. ఇక, స్టార్ కల్చర్‌ను “రద్దు చేయాలి” అనే చర్చలు కొనసాగుతున్న వేళ.. రోహిత్ శర్మ తన బ్యాట్‌తోనే వారందరికీ సమాధానం చెప్పాడు. నక్షత్రాలను విమర్శించొచ్చు, ప్రశ్నించొచ్చు.. కానీ భారత క్రికెట్‌కు అసలైన ఆకర్షణ మాత్రం స్టార్లే అని మరోసారి నిరూపించాడు.