పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్-పాకిస్థాన్‌ల మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందించారు. ప్రస్తుతం రెండు దేశాలు సంయమనం పాటించాలని కోరారు.
పహల్గామ్లో నేరమేధం సృష్టించిన ఉగ్రవాదులు ప్రస్తుతం భారత్‌లోనే ఉన్నట్లుగా దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఒక నిర్ధారణకు వచ్చింది. దక్షిణ కాశ్మీర్‌లోని దట్టమైన అడవుల్లో సేఫ్ జోన్లో ఉన్నట్లుగా భావిస్తోంది.
దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం తెల్లవారుజామున సృష్టించిన దుమ్ము తుఫాన్, భారీ వర్షానికి నగరం అతలాకుతలం అయింది. రహదారులపై నీళ్లు నిలిచిపోయాయి. ఇక భారీ ఈదురుగాలుల కారణంగా చెట్లు నేలకొరిగాయి.
పహల్గామ్ ఉగ్రదాడిలో భర్తను కోల్పోయిన నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి కీలక వ్యాఖ్యలు చేశారు. వినయ్ నర్వాల్ గౌరవార్థం నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఫోరమ్ ఆఫ్ ఆర్టిస్ట్స్ అండ్ యాక్టివిస్ట్స్ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమానికి హిమాన్షి హాజరయ్యారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భారీ వర్షం, దుమ్మ తుఫాన్ బీభత్సం సృష్టించింది. దీంతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇక తీవ్రమైన ఈదురుగాలుల కారణంగా విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. కనెక్టివిటీ విమానాలు అందుకోవల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే ప్రయాణికులు నిలిచిపోయారు. సిబ్బంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణికులకు సేవలు అందిస్తుందని ఢిల్లీ విమానాశ్రయం […]
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ జోరు పెంచింది. ఈ కేసులో అరెస్టైన ఏ1 కేసీరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఏ8 చాణక్య ఆస్తుల వివరాలను సిట్ అధికారులు సేకరిస్తున్నారు. 2019-2024 సమయంలో కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలు ఇవ్వాలని రిజిస్ట్రార్ శాఖ ఐజీని సిట్ కోరింది.
విశాఖలోని సింహాచలం అప్పన్న సన్నిధిలో జరిగిన ప్రమాద స్థలిని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ బృందం పరిశీలించింది. బొత్స వెంట మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, పలువురు వైసీపీ నేతలు ఉన్నారు.
శ్రామికులే లేకపోతే దేశ నిర్మాణం లేదని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు. మేడే సందర్భంగా శ్రామికులతో పవన్‌కల్యాణ్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.