ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ఆత్మకూరు మండలం నెల్లూరుపాలెంలోని ఎస్టీ కాలనీలో పర్యటించారు. ‘‘పేదల సేవలో పింఛన్ పంపిణీ’’ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొ్న్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద చలంచర్ల సుస్మితకు వితంతు పెన్షన్ పంపిణీ చేశారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారుల కుటుంబ సభ్యులందరితోనూ మాట్లాడారు.
ఇది కూడా చదవండి: AP Liquor Scam: లిక్కర్ కేసులో సిట్ జోరు.. నిందితుల ఆస్తుల వివరాలు సేకరణ
టీటీసీ చదివిన సుస్మితకు డీఎస్సీలో ఉద్యోగం కోసం ఉచితంగా శిక్షణ ఇప్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే ఐదేళ్ల చిన్నారి చేత్రికను గురుకుల పాఠశాలలో చేర్పించి.. ఉచితంగా నాణ్యమైన చదువు చెప్పించే బాధ్యత తాను తీసుకుంటానని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఇక పేద కుటుంబంలోని అంకోజి-సుమ కుమారుడికి వ్యవసాయ రంగంలో డ్రోన్ శిక్షణతో పాటు ఉపాధి కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Karnataka: రూ.10 వేలకు ఆశపడి.. 5 ఫుల్ బాటిళ్ల మద్యం తాగిన యువకుడు.. చివరకు