దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భారీ వర్షం, దుమ్మ తుఫాన్ బీభత్సం సృష్టించింది. దీంతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇక తీవ్రమైన ఈదురుగాలుల కారణంగా విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. కనెక్టివిటీ విమానాలు అందుకోవల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే ప్రయాణికులు నిలిచిపోయారు. సిబ్బంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణికులకు సేవలు అందిస్తుందని ఢిల్లీ విమానాశ్రయం హామీ ఇచ్చింది. ప్రయాణికులు విమాన సంస్థల వైబ్‌సైట్లు చెక్ చేసుకోవాలని సూచించింది.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy : నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకంటే..?
విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని.. ప్రయాణికులు వైబ్‌సైట్‌ను పరిశీలించుకోవాలని ఎయిరిండియా సూచించింది. అంతరాయాలను తగ్గించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తామని తెలిపింది. కొన్ని విమానాలు ఆలస్యం అవుతున్నాయని.. ఇంకొన్ని దారి మళ్లించినట్లుగా పేర్కొంది. విమాన షెడ్యూల్‌ను చెక్ చేసుకోవాలని సూచించింది.
ఇక ఢిల్లీలోని ద్వారక, ఖాన్‌పూర్, సౌత్ ఎక్స్‌టెన్షన్ రింగ్ రోడ్, మింటో రోడ్, లజ్‌పత్ నగర్ మరియు మోతీ బాగ్ వంటి ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. ఇక భారీ ఈదురుగాలుల కారణంగా చెట్లు కూలిపోయాయి. కొన్ని కొమ్మలు రహదారులపై పడిపోయాయి. అయితే అధికారులు నష్టాన్ని అంచనా వేయలేదు. వీలైనంత వరకు ప్రజల్లో ఇళ్లల్లోనే ఉండాలని ప్రజలకు అధికారులు సూచించారు.
ఇది కూడా చదవండి: Vijay Deverakonda : ట్రైబల్స్ ను కించపరిచారు.. విజయ్ దేవరకొండపై ఫిర్యాదు
ప్రస్తుతం ఢిల్లీలో ఉష్ణోగ్రత 19.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఢిల్లీ అంతటా భారీ వర్షాలు, తుఫానులు సంభవిస్తాయని.. గంటకు 70-80 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. శనివారం వరకు ఢిల్లీలో భారీ వర్షాలు, ఉరుములు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. మే నెలలో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. ఇప్పుడు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.
#WATCH | Delhi | Residents of the national capital woke up to heavy rain showers accompanied by strong winds this morning.
(Visuals from Shanti Path) pic.twitter.com/GTqPL8buy2
— ANI (@ANI) May 2, 2025
Passenger Advisory issued at 05:20 Hrs#DelhiAirport #PassengerAdvisory pic.twitter.com/aeAbNe78Cn
— Delhi Airport (@DelhiAirport) May 1, 2025
#6ETravelAdvisory: A thunderstorm is expected in Delhi. If you’re flying with us, we’re here to support you every step of the way. Please check your flight status before leaving: https://t.co/VhykW6WdB1 — your safety and comfort matter most. pic.twitter.com/ZSC8cwVLYM
— IndiGo (@IndiGo6E) May 1, 2025