డ్రోన్లు, బెలూన్ల ఎగరవేతపై ఏపీ పోలీసులు ఆంక్షలు విధించారు. రేపు ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో అమరావతి పరిధిలో డ్రోన్లు, బెలూన్ల ఎగరవేతపై నిషేధం విధించారు. ఒకవేళ ఎగరవేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
విశాఖలోని సింహాచలం అప్పన్న సన్నిధిలో బుధవారం జరిగిన ప్రమాదంపై దర్యాప్తు బృందం విచారణ ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది.
ప్రధాని మోడీ శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను మోడీ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సుమారు రూ.58 వేల కోట్ల అమరావతి ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపనం, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
అమరావతిలో శుక్రవారం రాజధాని నిర్మాణ పనులు పున:ప్రారంభం కాబోతున్నాయి. ప్రధాని మోడీ చేతుల మీదుగా పనులు ప్రారంభం కానున్నాయి. అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఇక రాష్ట్రంలో ఉన్న వివిధ రాజకీయ పార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానాలు పంపించింది.
దేశంలో రోజురోజుకు నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మార్పు రావడం లేదు. పట్టపగలే దారుణ హత్యలకు తెగబడుతున్నారు. నాలుగు రోజుల క్రితం హత్యకు గురైన సంఘటన గుంటూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ గురువారం స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేవం కానున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం, ప్రకాశం జిల్లా మార్కాపురం, శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం వైసీపీ స్ధానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో జగన్ సమావేశం కానున్నారు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పర్యటించనున్నారు. నెల్లూరు పాలెంలోని గిరిజన కాలనీలో పింఛన్లు పంపిణీ చేయనున్నారు. లబ్ధిదారులను కలిసి వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. కొద్దిసేపు వారితో ముచ్చటించనున్నారు.
విశాఖలో మళ్లీ వర్షం మొదలైంది. ఇప్పటికే సింహాచలం అప్పన్న సన్నిధిలో భారీగా భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు. వర్షం కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక కొండ దిగువున బస్సులు దొరక్క భక్తులు అవస్థలు పడుతున్నారు