ఇండోనేషియాలో ముగ్గురు భారతీయులకు మరణశిక్ష పడింది. 106 కిలోల మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేసిన కేసులో ముగ్గురు భారతీయులకు న్యాయస్థానం మరణశిక్ష విధించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవతారం మార్చారు. పోప్ అవతారంలో ఉన్న ఒక ఫొటోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. తనకు తాను పోప్‌గా ఊహించుకుంటూ ఒక చిత్రాన్ని పోస్ట్ చేశారు.
గోవాలోని షిర్గావ్ శ్రీ లైరాయ్ జాతరలో తొక్కిసలాటు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు మృతిచెందగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. దీంతో వారిని జీఎంసీ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు.
దేశ రాజధాని ఢిల్లీకి మరోసారి కేంద్ర వాతావరణ శాఖ ఉరుములతో కూడిన భారీ వర్ష సూచన చేసింది. శుక్రవారం తెల్లవారుజామున భారీ వర్షం, దుమ్ము తుఫాన్ బీభత్సం సృష్టించింది. 124 సంవత్సరాల తర్వాత అత్యంత భారీ వర్షం శుక్రవారం కురిసినట్లుగా వాతావరణ శాఖ తెలిపింది.
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో మాంసం, మద్యం మరియు అభ్యంతరకమైన ప్రకటనలు నిషేధిస్తూ అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. రామమందిరానికి 14 కిలోమీటర్ల దూరంలో ఈ నిషేధం అమలు కానుంది.
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తన పక్కన నిలబడడంతో కొంత మందికి నిద్ర పట్టదని హస్తం పార్టీపై ప్రధాని మోడీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేరళలో విజింజం అంతర్జాతీయ ఓడరేవును మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ హాజరయ్యారు.
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పాకిస్థాన్-భారత్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పాకిస్థాన్‌పై భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలను నిలిపివేసింది. అనంతరం పాకిస్థాన్ వీసాలను రద్దు చేసింది. అంతేకాకుండా అటారీ సరిహద్దు మూసివేసింది.
మంగళూరులో రౌడీషీటర్ సుహాస్ శెట్టి హత్య తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. గురువారం రాత్రి స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా దుండగులు అడ్డగించి హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.