సింహాచలం అప్పన్న సన్నిధిలో గోడ కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో పలు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఇక కేజీహెచ్ ఆస్పత్రిలో బాధిత కుటుంబాలను హోంమంత్రి అనిత పరామర్శించారు. ఈ సందర్భంగా రూ.కోటి పరిహారం ప్రకటించాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేశాయి.
హైదరాబాద్‌లో అందాల పోటీలను అందరూ వ్యతిరేకించాలని.. పవిత్రమైన స్త్రీ జన్మను అపవిత్రం చేయొద్దని సీపీఐ నారాయణ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరులో మేనకోడలకు చెందిన కావేరి ఫుడ్ ప్రొడెక్ట్ షాపును నారాయణ ప్రారంభించి మాట్లాడారు.
సింహాచలం అప్పన్న సన్నిధిలో గోడ కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు భక్తులు ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. ఇక సంఘటనాస్థలిని మంత్రులు, అధికారులు, వైసీపీ నేతలు పరిశీలించారు. అయితే ఈ ప్రమాదంపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
విశాఖకు వాతావరణ శాఖ మరోసారి వర్ష సూచన చేసింది. దీంతో సింహాచలం ఆలయ అధికారులు అప్రమత్తం అయ్యారు. సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవానికి భక్తులు క్యూకట్టారు. వర్ష సూచన నేపథ్యంలో భక్తులకు వేగంగా దర్శనాలు చేయిపిస్తున్నారు.
విశాఖ సింహాచలం అప్పన్న సన్నిధిలో జరిగిన ప్రమాదంలో ఇంటీరియర్ డిజైనర్ పతి దుర్గ స్వామి నాయుడు (32) సహా అతని స్నేహితుడు కుంపట్ల మణికంఠ ఈశ్వర శేషారావు (29) ప్రాణాలు కోల్పోయారు.
విశాఖ సింహాచలం అప్పన్న సన్నిధిలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు సాప్ట్వేర్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేజీహెచ్ ఆస్పత్రి దగ్గర బంధువుల రోదనలు మిన్నంటాయి. గుండెలు పగిలేలా విలపిస్తున్నారు.
సింహాచలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రమాద ఘటన తీవ్ర ఆవేదనకు గురి చేసిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
సింహాచలం ఘటనపై ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఇక పీఎం సహాయ నిధి నుంచి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున.. క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున సాయం ప్రకటించారు.
సింహాచలం దుర్ఘటన దురదృష్టకరం అని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు. ఈ మేరకు పవన్‌కల్యాణ్ ప్రెస్‌నోట్ విడుదల చేశారు. సింహాచలంలో గోడ కూలి క్యూలైన్లో ఉన్న భక్తులు మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు.