రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా శతవిధాలా ప్రయత్నిస్తోంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి యుద్ధం ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు.
అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్ కారణంగా దేశ వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక కర్ణాటక, మహారాష్ట్రలో అయితే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్ కారణంగా బెంగళూరు, ముంబైలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక సోమవారం కురిసిన కుండపోత వర్షానికి ఇప్పటికే బెంగళూరు నగరం అతలాకుతలం అయింది.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ వైపు గాజాపై విరుచుకుపడుతున్న ఐడీఎఫ్ దళాలు.. తాజాగా ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేసేందుకు ఇజ్రాయెల్ దళాలు ప్రణాళికలు రచిస్తున్నాయి.
ఆర్థిక రాజధాని ముంబైను కుండపోత వర్షం ముంచెత్తింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి నగరం అతలాకుతలం అయింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వృక్షాలు కూలిపోవడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.
పాకిస్థాన్ తీరును అంతర్జాతీయ వేదికపై ఎండగట్టేందుకు కేంద్రం రాజకీయ పార్టీలతో బృందాలను ఏర్పాటు చేసింది. ఏడు బృందాలను ఆయా దేశాలకు పంపించేందుకు రాజకీయ పార్టీలను పేర్లు అడిగింది. కానీ పేర్లు ఇవ్వకముందే కేంద్రం.. కమిటీ సభ్యుల్ని ఎంపిక చేసింది.
గాజాపై ఇజ్రాయెల్ మారణహోమం కొనసాగిస్తోంది. తాజాగా సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఐడీఎఫ్ దళాలు జరిపిన దాడుల్లో 60 మంది మరణించినట్లు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది.
ముంబైలో కోవిడ్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) సోమవారం పౌరులకు విజ్ఞప్తి చేసింది. అయితే సింధుదుర్గ్, డోంబివ్లికి చెందిన ఇద్దరు మహిళలు ఆదివారం ముంబై నగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.