కేంద్ర వాతావరణ శాఖ దేశ ప్రజలకు చల్లని కబురు చెప్పింది. ఈ ఏడాది ఐదు రోజులు ముందుగానే.. అనగా మే 25న నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు ఐఎండీ తెలిపింది.
తమిళనాడు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మద్యం సంస్థ టాస్మాక్‌పై చేస్తున్న ఈడీ దాడులపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సీరియస్ అయింది. ఈడీ అన్ని హద్దులు దాటిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
కన్నడ నటి రన్యారావు బంగారం స్మగ్లింగ్ కేసు వ్యవహారం కర్ణాటక ప్రభుత్వానికి చుట్టుకుంటోంది. కేబినెట్లో కీలక నేత, హోంమంత్రి పరమేశ్వర సంస్థలపై బుధవారం నుంచి ఈడీ దాడులు చేస్తోంది. అలాగే మంత్రిని కూడా ప్రశ్నించారు.
మన మహిళల సిందూరాన్ని తుడిచిన వాళ్లను మట్టిలో కలిపేశామని ప్రధాని మోడీ అన్నారు. మోడీ రాజస్థాన్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బికనీర్‌లో ఏర్పాటు చేసిన సభలో పహల్గామ్ గురించి మాట్లాడుతూ.. పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు.
భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణకు తానే కారణమని పదే పదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. గతంలో ఒకసారి ఇలా చెప్పగా.. తాజాగా మరోసారి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాతో సమావేశం సందర్భంగా అవే వ్యాఖ్యలు చేశారు.
అగ్ర రాజ్యం అమెరికాలో ఇజ్రాయెల్ లక్ష్యంగా కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సిబ్బంది చనిపోయారు. దీంతో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది.
భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతలను తానే పరిష్కరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ వ్యాఖ్యానించారు. వైట్‌హౌస్‌లో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ అయ్యారు.