భారీ తుఫాన్ దేశ రాజధాని ఢిల్లీని హడలెత్తించింది. బుధవారం సృష్టించిన విలయానికి నగరం అతలాకుతలం అయింది. దుమ్ము, ఈదురుగాలులతో కూడిన వర్షంతో జనజీవనం అస్తవ్యస్తం అయింది.
ఐడీఎఫ్ దాడుల్లో హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వార్ చనిపోయే అవకాశం ఉందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. గత 5 నెలల్లో తొలిసారి బుధవారం నెతన్యాహు మీడియాతో మాట్లాడారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఓ రిపోర్టర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవల్ కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోవాలంటూ ఫైరయ్యారు. ఆ రిపోర్టర్‌ను ‘గెట్ అవుట్’ అన్నారు. దీంతో ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది.
అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్ కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచే పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.
వైభవ్ సూర్యవంశీ... ఐపీఎల్ చరిత్రలో ఈ పేరు మరో పదేళ్లు గుర్తుండి పోతుంది. పద్నాలుగేళ్ల ప్రాయంలో ఐపీఎల్లో అడుగుపెట్టి 35 బంతుల్లో సెంచరీ బాది ప్రపంచ క్రికెట్‌నే ఆశ్చర్యానికి గురిచేశాడు.
గాజా పరిస్థితి దయనీయంగా మారింది. తిండి లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. కొద్దిరోజులుగా మానవతా సాయం నిలిచిపోవడంతో ఆహారం, నీళ్లు లభించక విలవిలలాడిపోతున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో 28 మంది మావోలు హతమయ్యారు. ఇందులో మావోయిస్టు అగ్ర నేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ అలియాస్ గగన్నా హతమయ్యాడు.
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి తుపాకుల మోతతో అడవులు దద్దరిల్లాయి. మావోల ఏరివేత ఆపరేషన్ చేపట్టిన భద్రతా దళాలు బుధవారం కూడా మావోల కోసం జల్లెడ పట్టాయి. దీంతో నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలకు మావోలు ఎదురుపడ్డారు.
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థకు సంబంధించిన ‘‘గోల్డె్న్ డోమ్’’ వ్యవస్థను ప్రపంచానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో తాను హామీ ఇచ్చినట్లుగా అత్యాధునిక క్షిపణి రక్షణ కవచాన్ని అమెరికా ప్రజలకు అందించబోతున్నట్లు తెలిపారు.