ఆర్థిక రాజధాని ముంబైను కుండపోత వర్షం ముంచెత్తింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి నగరం అతలాకుతలం అయింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వృక్షాలు కూలిపోవడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇక డ్రైనేజీలు పొంగి పొర్లాయి. ఇక రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఇది కూడా చదవండి: Terrorists: సైనికుల దుస్తుల్లో టెర్రరిస్టులు.. భయపడుతున్న కాశ్మీరీలు..
ముంబై, పూణెతో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం నుంచి ఈదారుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిశాయి. ఓ వైపు ఎండ వేడిమి నుంచి ప్రజలు ఉపశమనం పొందినా.. మరోవైపు భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Pakistan: లష్కరే ఉగ్రవాది, హఫీస్ సయీద్ సన్నిహితుడికి తీవ్రగాయాలు.. గుర్తు తెలియని వ్యక్తుల పనేనా..?
మంగళవారం సాయంత్రం ఆకస్మిక వర్షంతో ముంబైలోని పోవై వంటి ప్రాంతం జలమయం అయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. జల్వాయు కాంప్లెక్స్ సమీపంలో చెట్లు కూలిపోయాయి. దీంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తడంతో వాహనదారులు వేరే మార్గాల్లో వెళ్లాల్సి వచ్చింది. ఇక రత్నగిరి జిల్లాలోని వెర్వాలి, విలావాడే రైల్వేస్టేషన్ల మధ్య కొండచరియలు విరిగిపడడంతో కొంకణ్ రైల్వే మార్గంలో రైలు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే కోస్తా కొంకణ్-గోవా మార్గంలో భారీ బండరాయి పడడంతో మహారాష్ట్ర, గోవా, కర్ణాటకలను కలిపే 741 కిలోమీటర్ల మార్గంలో రైలు రాకపోకలు నిలిచిపోయాయి.
ఇదిలా ఉంటే మరో నాలుగు రోజుల పాటు మహారాష్ట్రలో భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కర్ణాటక తీరం వెంబడి తూర్పు-మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను కారణంగా బుధవారం- శనివారం మధ్య మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ముంబైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. మే 22న అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఆ తర్వాత అది ఉత్తరం వైపు కదిలి మరింత బలపడే అవకాశం ఉందని కేంద్రం తెలిపింది. తుఫాన్ కారణంగా మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కొన్ని చోట్ల గంటకు 30-40 కి.మీ లేదా అంతకంటే ఎక్కువ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.