Iran-Israel: మరోసారి ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య టెన్షన్.. అణు కేంద్రాలపై దాడికి ఐడీఎఫ్ ప్లాన్!
- మరోసారి ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య టెన్షన్
- అణు కేంద్రాలపై దాడికి ఐడీఎఫ్ ప్లాన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ వైపు గాజాపై విరుచుకుపడుతున్న ఐడీఎఫ్ దళాలు.. తాజాగా ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేసేందుకు ఇజ్రాయెల్ దళాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇరాన్‌తో అగ్ర రాజ్యం అమెరికా అణు ఒప్పందంపై కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండగా ఇజ్రాయెల్ దాడులకు సిద్ధపడుతున్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ గుర్తించింది. ఇరాన్ అణు కేంద్రాలపై ఐడీఎఫ్ దళాలు దాడులు చేసే అవకాశం ఉందని అమెరికా నిఘా సంస్థ సూచించింది. అయితే దాడులపై ఇజ్రాయెల్ తుది నిర్ణయం తీసుకున్నారో లేదో స్పష్టం చేయలేదని నివేదికలు పేర్కొన్నాయి. ఒక ప్రణాళికతోనే ఇజ్రాయెల్ దాడులకు దిగుతున్నట్లుగా నివేదికలు పేర్కొంటున్నాయి. ఒకవేళ అది జరిగితే అమెరికా చర్చలకు బ్రేక్ పడే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Spy Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా డైరీ స్వాధీనం.. వెలుగులోకి కీలక విషయాలు
Also Read
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
- Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
- Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
ఇదిలా ఉంటే అమెరికా నిఘా సంస్థ హెచ్చరికలపై వాషింగ్టన్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ఇప్పటి వరకు స్పందించలేదు. అమెరికా నుంచి ప్రకటన వచ్చి ఇన్ని గంటలు అవుతున్నా.. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి కార్యాలయం కూడా స్పందించకపోవడం విశేషం.
ఇది కూడా చదవండి: Akhanda 2 : బాలయ్యతో క్రేజీ కాంబినేషన్ రిపీట్ చేస్తున్న బోయపాటి ?
ఇరాన్‌తో అమెరికా అణు ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు ట్రంప్ పరిపాలన.. ఇరాన్‌తో చర్చలు జరుపుతోంది. అణు ఒప్పందంపై దౌత్యపరమైన ఒప్పందాన్ని సాధించే లక్ష్యంతో అమెరికా ప్రయత్నిస్తోంది. ఇంతలోనే ఇజ్రాయెల్ దాడులకు సిద్ధపడుతోంది. ఇదిలా ఉంటే మంగళవారం ఇరాన్ సుప్రీం లీడర్ ఆయుతుల్లా అలీ ఖమేనీ మాట్లాడుతూ.. అణు ఒప్పందంపై చర్చలు విజయవంతం అవుతాయా? లేదా అనే దానిపై సందేహాలు వ్యక్తం చేశారు.
గాజా, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేసిన సమయంలో ఇరాన్ జోక్యం చేసుకుంది. వందల కొద్ది క్షిపణులను ఇరాన్ ప్రయోగించింది. వాటిని ఐడీఎఫ్ దళాలు తిప్పికొట్టాయి. అనంతరం ఇరాన్ అణు స్థావరాలపై దాడి చేసింది. మరోసారి అదే తరహాలో దాడులు చేసేందుకు ఇజ్రాయెల్ ప్రణాళికలు రచించింది.
తాజావార్తలు
-
CJP: ‘‘ రాజులు కాదు’’.. ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన.
-
Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
-
Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ ‘ఏ’ జట్టులోకి ఎంట్రీ..
-
Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
-
No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!