అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్ కారణంగా దేశ వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక కర్ణాటక, మహారాష్ట్రలో అయితే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే రైళ్ల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. తాజాగా విమాన సంస్థలు కూడా అప్రమత్తం అయ్యాయి. ఆయా రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు కారణంగా విమాన రాకపోకల్లో ఆలస్యం ఉంటుందని ఇండిగో విమాన సంస్థ ప్రయాణికులను హెచ్చరించింది. విమాన షెడ్యూల్‌ను వైబ్‌సైట్లో చెక్ చేసుకోవాలని సూచించాయి. గోవాలో భారీ వర్షం కురవడంతో విమాన సర్వీసుల్లో అంతరాయం ఉంటుందని తెలిపింది.
ఇది కూడా చదవండి: Vizag: ప్రపంచరికార్డు సృష్టించేలా అంతర్జాతీయ యోగా డే వేడుకలు.. విశాఖలో భారీ ఏర్పాట్లు
ప్రస్తుతం కర్ణాటక, మహారాష్ట్ర, గోవాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రెండు రోజుల్లో మరింత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముంబై, బెంగళూరు నగరాలు వర్షం కారణంగా మునిగిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక రైళ్ల రాకపోకల్లో కూడా అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
ఇది కూడా చదవండి: Hyderabad: ఇంట్లో చోరీకి గురైన బంగారు ఆభరణాలు దొరకలేదని.. కొడుకుతో సహా తల్లి..
IndiGo issues travel advisory. Tweets, "Goa is experiencing rain, which may affect flight operations…" pic.twitter.com/XQG6FSiD8B
— ANI (@ANI) May 21, 2025