కల్నల్ సోఫియా ఖురేషిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశానికి గైర్హాజరయ్యారు. మంత్రి చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా పెద్ద దుమారం రేపాయి. దీంతో మంత్రి పదవికి రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలోనే ఆయన మంత్రివర్గ సమావేశానికి రాలేదని తెలుస్తోంది. అయితే ఆయన రాజీనామా చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Saiyami Kher : టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు ..!
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది హిందువులు చనిపోయారు. దీనికి ప్రతీకారంగా భారత్ ప్రభుత్వం మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దీనికి కల్నల్ సోఫియా ఖురేషి నేతృత్వం వహించారు. ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు మీడియాకు తెలియజేస్తూ గుర్తింపులోకి వచ్చారు. అయితే మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా.. ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్‌లో ఉగ్రవాదలు.. 26 మంది మహిళల సిందూరం తుడిచేస్తే.. అది ఉగ్రవాదుల మతానికి చెందిన సోఫియా ఖురేషిని ప్రధాని మోడీ పాకిస్థాన్‌కు పంపించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా మంత్రి వ్యాఖ్యలు దుమారం రేపాయి. వెంటనే ఆయనపై కేసు నమోదు చేయాలని మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. అనంతరం దేశ సర్వో్న్నత న్యాయస్థానం కూడా తీవ్రంగా తప్పుపట్టింది. మంత్రి వ్యాఖ్యలతో దేశం తలదించుకుంటుందని ఆక్షేపించింది. మంత్రి క్షమాపణలను అంగీకరించబోమని తెలిపింది. ఆయనపై విచారణ జరపాలని ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Hyderabad: పెళ్లి పేరుతో మోసం.. బంజారాహిల్స్ లో లేడీ డాక్టర్ పై మరో వైద్యుడి లైంగిక దాడి
ఈ వివాదం నేపథ్యంలో మంగళవారం మధ్యప్రదేశ్ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి విజయ్ షా హాజరు కాలేదు. దీంతో ఆయన రాజీనామా చేయొచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఏదొక సమయంలో మంత్రి పదవి నుంచి తప్పుకునే అవకాశం కనిపిస్తోంది.