ఐపీఎల్ తర్వాత టీమిండియా ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగుతుంది. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో భారత్ ఇంగ్లాండ్ టూర్లో కఠిన సవాళ్లు ఎదుర్కోనుంది.
బెంగళూరు దేశంలోనే టెక్ సిటీగా పేరుగాంచింది. బెంగళూరు సిటీ అంటే సుందరవనానికి మారుపేరు. అలాంటి నగరం ఇప్పుడు కుక్కలు చింపిన విస్తరిలా తయారైంది. నగర రోడ్లన్నీ గుంతలమయం అయ్యాయి.
పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ పట్టుబడ్డ హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని పోలీసులు పేర్కొన్నారు. శనివారం ఆమెను అరెస్ట్ చేయగా.. న్యాయస్థానం ఆమెను ఐదు రోజులు కస్టడీకి ఇచ్చింది. దీంతో అధికారులు వివిధ కోణాల్లో విచారణ చేపట్టారు.
కన్నతల్లిని.. పుట్టిన గడ్డను మరిచిపోకూడదంటారు. ఇక దేశం పట్ల కృతజ్ఞత భావంతో ఉండాలని పెద్దలు చెబుతుంటారు. భారతదేశం విషయానికొస్తే.. ఇక్కడున్న సంస్కృతి, సంప్రదాయాలు, వాతావరణం ఏ దేశంలో ఉండదు.
మహారాష్ట్ర కేబినెట్లో మంగళవారం ఒక కీలక పరిణామం జరగనుంది. దేవేంద్ర ఫడ్నవిస్ మంత్రివర్గంలో ఎన్సీపీకి చెందిన 77 ఏళ్ల రాజకీయ కురు వృద్ధుడు ఛగన్ భుజ్బాల్ చేరనున్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణపై త్వరలోనే రష్యా-ఉక్రెయిన్ చర్చలు ప్రారంభిస్తాయని ప్రకటించారు.
ఇండోనేషియాలో భారీ విస్ఫోటనం జరిగింది. లెవోటోబి లకి-లకి పర్వతం బద్ధలైంది. దీంతో శిఖరం నుంచి బూడిద మేఘం వైపు 6 కి.మీ ఎత్తుకు ఎగిసిపడింది. సోమవారం ఉదయం పర్యాటక ద్వీపమైన ఫ్లోర్స్‌లోని ఉదయం 09:36 గంటలకు లెవోటోబి లకి-లకి అగ్నిపర్వతం మరోసారి పేలిందని జియోలాజికల్ ఏజెన్సీ తెలిపింది
కల్నల్ సోఫియా ఖురేషిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్ షాపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి క్షమాపణలను అంగీకరించలేమని చెప్పింది. ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలని తెలియదా? అని ఫైర్ అయింది.
పాకిస్థాన్ వైఖరిని అంతర్జాతీయ వేదికపై ఎండగట్టేందుకు కేంద్రం పూనుకుంది. ఇందుకోసం ఆయా దేశాలు వెళ్లేందుకు బృందాలను ఏర్పాటు చేశాయి. అయితే ఎంపీల పేర్లు ఇవ్వాలంటూ ఆయా పార్టీలకు కేంద్రం లేఖలు రాసింది.