జగదీప్ ధన్కర్ అనూహ్యంగా జూలై నెలలో ఉపరాష్ట్రపతి పదవి నుంచి తప్పుకున్నారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయిన రోజే ఊహించని రీతిలో ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో తప్పుకుంటున్నట్లు రాష్ట్రపతికి లేఖ రాశారు.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎంత ప్రయత్నించారో ప్రపంచమంతటికి తెలిసిందే. అనేక యుద్ధాలు ఆపానని తనకే నోబెల్ శాంతి బహుమతి దక్కుతుందని ట్రంప్ ఆశపడ్డారు.
ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత యావత్తు భారతదేశం ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురైంది. దేశ వ్యాప్తంగా ఎంత పెద్ద స్థాయిలో ఉగ్ర దాడులకు డాక్టర్ల బృందం కుట్ర చేసిందో తెలిసిందే. ఇక డాక్టర్ల నివాసంలో భారీగా అమ్మోనియం నైట్రేట్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే అధునాతన ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
హిందువులు లేకుండా ప్రపంచం లేదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. మణిపూర్లో మోహన్ భగవత్ మాట్లాడారు. గ్రీస్, ఈజిప్ట్, రోమ్ వంటి సామ్రాజ్యాలను కూడా భారతదేశ నాగరికత ప్రభావం చూపించిందని తెలిపారు.
బంగారం ధరలు రోజుకు ఒకలా ఉంటున్నాయి. ఒక్కోసారిగా భారీగా పెరిగిపోతున్నాయి. మరొకసారి స్వల్పంగా తగ్గుతున్నాయి. ఇలా ధరలు హెచ్చు తగ్గులు అవుతున్నాయి. ఇటీవల తగ్గినట్టే తగ్గి.. మళ్లీ షాకిస్తున్నాయి.
కొంత మంది వైద్యులు.. వైద్య వృత్తికే మాయని మచ్చ తెస్తున్నారు. పవిత్రమైన వృత్తిలో ఉన్నామన్న స్పృహ లేకుండా కొందరు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాస్పత్రిలో ఇలాంటి సంఘటనే జరిగింది.
రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి కోసం ట్రంప్ 28 పాయింట్ల ప్రణాళిక రచించారు. ఈ ప్రణాళికపై గురువారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో అమెరికా అధికారులు చర్చించారు. వారం రోజుల్లో ప్రణాళికను అంగీకరించాల్సిందేనని అల్టిమేటం విధించారు.
నిన్నామొన్నటిదాకా ట్రంప్ కారాలు.. మిరియాలు నూరారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా? ఎవరిపై ఆగ్రహం వ్యక్తం చేశారో ఆ వ్యక్తికే ట్రంప్ షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకు వైట్హౌస్ వేదికైంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కీలక నిర్ణయాలు దిశగా జన్ సురాజ్ వ్యవస్థాపకుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అడుగులు వేస్తున్నారు. తాజాగా శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాబోయే ఐదేళ్లలో తాను సంపాదించే దాంట్లో 90 శాతం జన్ సురాజ్ పార్టీ చొరవ కోసం విరాళంగా ఇస్తానని ప్రకటించారు.