ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత యావత్తు భారతదేశం ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురైంది. దేశ వ్యాప్తంగా ఎంత పెద్ద స్థాయిలో ఉగ్ర దాడులకు డాక్టర్ల బృందం కుట్ర చేసిందో తెలిసిందే. ఇక డాక్టర్ల నివాసంలో భారీగా అమ్మోనియం నైట్రేట్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే అధునాతన ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: Mohan Bhagwat: హిందువులు లేకుండా ప్రపంచమే లేదు.. ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
ఓ వైపు ఢిల్లీ బ్లాస్ట్‌పై దర్యాప్తు జరుగుతుండగానే ఇంకోవైపు మరో అంతర్జాతీయ ఆయుధాల స్మగ్లింగ్ రాకెట్ బయటపడింది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు జరిపిన దాడిలో ఆయుధాల రాకెట్ బయటపడింది. రోహిణి ప్రాంతంలో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ నుంచి డ్రోన్ల ద్వారా ఆయుధాలను సరఫరా చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. పంజాబ్‌లోని పేరుమోసిన గ్యాంగ్‌స్టర్లకు అందజేసేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా ఈ రాకెట్ వెలుగుచూసింది. ఈ ఆయుధాలు టర్కీ, చైనాలో తయారైనట్లుగా కనిపెట్టారు.
ఇది కూడా చదవండి: UP Video: కాబోయే భార్యతో ఆస్పత్రిలోనే డ్యాన్స్ చేసిన డాక్టర్.. వీడియో వైరల్
లౌరేష్ బిష్ణోయ్, బాంబిహా, గోగి, హిమాన్షు భావు ముఠాలకు సరఫరా చేయడానికి ఆయుధాలు పంజాబ్ మీదుగా ఢిల్లీకి వచ్చినట్లు తెలుస్తోంది. క్రైమ్ బ్రాంచ్‌కు అందిన సమాచారంతో రోహిణి ప్రాంతంలో వల వేసి పోలీసులు పట్టుకున్నారు. దొరికిన ఆయుధాలు అధునాతనమైనవిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు నిందితులను విచారిస్తున్నారు. ఆయుధాల సరఫరా వెనుక ఉన్న నెట్‌వర్క్ వివరాలను సేకరిస్తు్న్నారు. అరెస్టైన నలుగురు నిందితులు ఉత్తరప్రదేశ్, పంజాబ్‌కు చెందిన వారిగా కనిపెట్టారు.
Delhi | Delhi Crime Branch arrested four accused in an international arms smuggling ring linked to the Pakistani ISI: Ajay, Mandeep, Dalvinder and Rohan. This gang was supplying high-end pistols made in Turkey and China to India via Pakistan. The weapons were dropped in Punjab… pic.twitter.com/ZFhzwnGvud
— ANI (@ANI) November 22, 2025
The Crime Branch says that this entire network was operating at the behest of individuals linked to the Pakistani ISI. The weapons were first transported to Pakistan and then smuggled into India from there.
Police are now investigating how many weapons these individuals have… pic.twitter.com/6ZugWSs47e
— ANI (@ANI) November 22, 2025