బంగారం ధరలు రోజుకు ఒకలా ఉంటున్నాయి. ఒక్కోసారిగా భారీగా పెరిగిపోతున్నాయి. మరొకసారి స్వల్పంగా తగ్గుతున్నాయి. ఇలా ధరలు హెచ్చు తగ్గులు అవుతున్నాయి. ఇటీవల తగ్గినట్టే తగ్గి.. మళ్లీ షాకిస్తున్నాయి. శనివారం మరోసారి భారీగా పెరిగాయి. తులం గోల్డ్‌పై రూ.1,860 పెరగగా.. కిలో వెండిపై రూ.3,000 పెరిగింది.
ఇది కూడా చదవండి: UP Video: కాబోయే భార్యతో ఆస్పత్రిలోనే డ్యాన్స్ చేసిన డాక్టర్.. వీడియో వైరల్
24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.1,860 పెరిగి రూ.1,25,840 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ. 1,700 పెరిగి రూ.1,15,350 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,390 పెరిగి రూ.94,380 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Russia-Ukraine: ట్రంప్ శాంతి ప్రణాళికకు పుతిన్ ఖుషి.. జెలెన్‌స్కీ తిరుగుబాటు!
ఇక వెండి ధరలు కూడా షాకిచ్చాయి. కిలో వెండిపై రూ.3,000 పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,64, 000 దగ్గర అమ్ముడవుతోంది. చెన్నై, హైదరాబాద్‌లో మాత్రం రూ.1, 72,000 దగ్గర ట్రేడ్ అవుతుండగా.. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.1,64, 000 దగ్గర అమ్ముడవుతోంది.