కొంత మంది వైద్యులు.. వైద్య వృత్తికే మాయని మచ్చ తెస్తున్నారు. పవిత్రమైన వృత్తిలో ఉన్నామన్న స్పృహ లేకుండా కొందరు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాస్పత్రిలో ఇలాంటి సంఘటనే జరిగింది. ఆస్పత్రి అన్న విషయం మరిచిపోయి కాబోయే భార్యతో కలిసి డ్యాన్స్‌లో మునిగిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Russia-Ukraine: ట్రంప్ శాంతి ప్రణాళికకు పుతిన్ ఖుషి.. జెలెన్‌స్కీ తిరుగుబాటు!
ప్రభుత్వాస్పత్రి అంటేనే ఎంతో మంది రోగులు వస్తూ పోతుంటారు. ఆయా సమస్యలతో పేషెంట్లు వస్తుంటారు. ఎంతో బాధతో.. ఎన్నో ఇబ్బందులతో వస్తుంటారు. ఆస్పత్రి అంటేనే ఒకరకమైన వాతావరణం ఉంటుంది. అలాంటిది ఒక డాక్టర్ మాత్రం ఆస్పత్రిని వినోదంగా మార్చేశాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని షామ్లి ప్రభుత్వాస్పత్రిలో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: G20 Summit: ఐటీ దిగ్గజాలతో ప్రధాని మోడీ భేటీ.. భారత్‌తో సంబంధాలు పెంచుకోవాలని పిలుపు
అఫ్కార్ సిద్ధిక్ అనే వైద్యుడు డ్యూటీలో ఉన్నాడు. అయితే కాబోయే భార్యను అతడే పిలిచాడో.. లేదంటే ఆమెనే వచ్చిందో తెలియదు గానీ.. షామ్లి ప్రభుత్వాస్పత్రిలో ప్రత్యక్షమైంది. అంతే వైద్యుడికి ఎక్కడలేని సంతోషం వచ్చేసింది. డ్యూటీ రూమ్ లోపల బనియన్‌తో ఉన్న అఫ్కార్ సిద్ధిక్.. కాబోయే భార్యతో కలిసి డ్యాన్స్‌లో మునిగిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అనుష్క శర్మ-రణ్‌వీర్ సింగ్ నటించిన బాలీవుడ్ చిత్రం బ్యాండ్ బాజా బారాత్‌లోని ‘‘దమ్ దమ్ మస్త్ హై…’’ పాటకు నృత్యం చేస్తున్నట్లు వీడియోలో కనిపించింది. వీడియోలో సిద్ధిక్ తెల్లటి రంగు బనియన్, నలుపు రంగు ట్రాక్ ప్యాంటు ధరించి ఉన్నాడు. వీడియో వైరల్ కావడంతో వైద్యుడికి చీఫ్ మెడికల్ ఆఫీసర్ నోటీస్ పంపించారు. చాలా కాలంగా సీహెచ్‌సీలో సిద్ధిక్ పనిచేస్తున్నట్లుగా సమాచారం. గతేడాది ఏప్రిల్‌లోనూ ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ ప్రభుత్వాస్పత్రిలో ఇదే మాదిరిగా వైద్యులు, సిబ్బంది నృత్యం చేసిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.
शामली में सामुदायिक स्वास्थ्य केंद्र के ऊपरी मंजिल पर बने कमरे में डॉक्टर साहब का महिला के साथ डांस का वीडियो वायरल है,
CMO साहब ने डॉक्टर साहब से जवाब माँगा है, pic.twitter.com/lZpMzaBOeg— ANIL (@AnilYadavmedia1) November 21, 2025