ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎంత ప్రయత్నించారో ప్రపంచమంతటికి తెలిసిందే. అనేక యుద్ధాలు ఆపానని తనకే నోబెల్ శాంతి బహుమతి దక్కుతుందని ట్రంప్ ఆశపడ్డారు. అంతేకాకుండా అనేక దేశాలు కూడా ట్రంప్ పేరును ప్రతిపాదించాయి. కానీ చివరికి ‘‘ఆశ దోశ అప్పడం వడ’’ అన్నట్టుగా నోబెల్ శాంతి బహుమతిని వెనిజులా ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడో తన్నుకుపోయారు. దీంతో ట్రంప్ గుండెలో పిడుగు పడినట్లైంది.
ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలో మరో ఉలిక్కిపాటు.. భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం
ఇంత వరకు బాగానే ఉంది గానీ.. తాజాగా నోబెల్ శాంతి గ్రహీత మచాడో (58)కు కొత్త చిక్కులొచ్చి పడ్డాయి. ఒకరేమో అవార్డు రాకుండా బాధపడుతుంటే.. ఇప్పుడు మచాడోకు అవార్డు అందుకోవడానికి కొత్త తలనొప్పి వచ్చి పడింది. డిసెంబర్ 10న నార్వే రాజధాని ఓస్లోలో నోబెల్ పురస్కారాల ప్రదానోత్సవం జరగనుంది. అవార్డు అందుకునేందుకు మచాడో దేశం దాటి బయటకు వెళ్తే పరారీలో ఉన్న నేరస్థురాలిగా ప్రకటిస్తామని వెనిజులా అటార్నీ జనరల్ ప్రకటించారు. కుట్రలు, విద్వేషాన్ని ప్రేరేపించడం, ఉగ్రవాదం వంటి ఆరోపణలు, పలు కేసులు ఉండడంతో ఈ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Mohan Bhagwat: హిందువులు లేకుండా ప్రపంచమే లేదు.. ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
దేశంలో నియంతృత్వంపై పోరాటం, ప్రజాస్వామ్యానికి శాంతియుత పరివర్తన కోసం మచాడో పోరాటం చేస్తున్నారు. అధ్యక్షుడు నికోలస్ మదురోకు వ్యతిరేకంగా తన గళాన్ని ఎత్తింది. అధ్యక్షుడికి వ్యతిరేకంగా ప్రజలంతా కలిసి రావాలని మచాడో పిలుపునిచ్చారు. అంతేకాకుండా అనేక దేశాలు కూడా నికోలస్‌కు వ్యతిరేకంగా గళమెత్తాయి. మొత్తానికి మచాడో పోరాటానికి ప్రతిఫలంగా నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఇప్పుడేమో అందుకోలేని పరిస్థితులు తలెత్తాయి. అటార్నీ జనరల్ ప్రకటనను పక్కన పెట్టి అవార్డు తీసుకుంటుందా? లేదంటే సైలెంట్‌గా ఉండిపోతుందో చూడాలి.