బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కీలక నిర్ణయాలు దిశగా జన్ సురాజ్ వ్యవస్థాపకుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అడుగులు వేస్తున్నారు. తాజాగా శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాబోయే ఐదేళ్లలో తాను సంపాదించే దాంట్లో 90 శాతం జన్ సురాజ్ పార్టీ చొరవ కోసం విరాళంగా ఇస్తానని ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Amit Shah: ఆపరేషన్ సిందూర్‌తో భారత సైన్యం సత్తా ప్రపంచానికి తెలిసింది.. బీఎస్‌ఎఫ్ దినోత్సవంలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు
బీహార్ నవనిర్మాణ్ సంకల్ప్ అభిమాన్ ప్రారంభించబడుతుందని.. ఎన్నికలకు మందు 10 వేలు అందుకున్న వారందరినీ కలుస్తామన్నారు. జనవరి 15 నుంచి ప్రతి ఇంటికి వెళ్లున్నట్లు చెప్పారు. వారికి రూ.2లక్షలు అందేలా ఫారమ్ నింపేలా చేస్తామన్నారు. ఢిల్లీలో కుటుంబం కోసం ఇల్లు తప్ప.. గత 20 ఏళ్లలో సంపాదించిన ఆస్తులన్నింటినీ పార్టీ కోసం విరాళం ఇస్తానని హామీ ఇచ్చారు. డబ్బు లేకపోవడం వల్ల ఏ కార్యక్రమం ఆగబోతున్నారు. జన్ సురాజ్‌కు విరాళంగా రూ.1,000 ఇవ్వాలని బీహారీయులను ప్రశాంత్ కిషోర్ కోరారు.
ఇది కూడా చదవండి: CJI BR Gavai: నేను లౌకికుడిని.. ప్రస్తుతం బౌద్ధమతాన్ని ఆచరిస్తున్నా.. వీడ్కోలు ప్రసంగంలో గవాయ్ వ్యాఖ్య
ఇటీవల ఒక జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. బీహార్ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం తప్పేనన్నారు. గతంలోకి తొంగి చూస్తే పోటీ చేయకపోవడం పొరపాటు జరిగినట్లుగానే అనిపిస్తోందని తెలిపారు. ఎన్నికలకు ముందు మహిళల ఖాతాలో రూ.10,000 వేయడంతోనే జేడీయూకు 85 సీట్లు వచ్చాయని చెప్పుకొచ్చారు. వాస్తవంగా అయితే 25 సీట్లు కంటే ఎక్కువ గెలవకపోయేది.. కానీ 10 వేలు ఇవ్వడంతో ఎక్కువ సీట్లు పొందగలిగిందని చెప్పుకొచ్చారు. ఇక తన ఆలోచనల్లో ఏదో తప్పు జరిగి ఉంటుందని.. ఓటమి పూర్తి బాధ్యత తనదేనన్నారు. 100 శాతం ఆ బాధ్యతను తానే తీసుకుంటున్నట్లు చెప్పారు. బీహార్ రాజకీయాలను మారుద్దామని కొత్త పాత్ర పోషించామని.. కానీ ప్రజలు తమను కోరుకోలేదన్నారు. మా ఆలోచనల్లో ఎక్కడో.. ఏదో జరిగి ఉంటుందని అనుకుంటున్నట్లు వాపోయారు. చాలా నిజాయితీగా ప్రయత్నించామని… కానీ అది పూర్తిగా విఫలమైందని చెప్పారు.
#WATCH | Bhitiharwa, West Champaran (Bihar): Jan Suraaj Founder Prashant Kishor says, "All those people who were lured and given the first instalment of Rs 10,000 – it is now the responsibility of Jan Suraaj to reach all of those individuals and ensure that they do not get… pic.twitter.com/32qpcAHCJb
— ANI (@ANI) November 21, 2025