పాకిస్థాన్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఒక రసాయన ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 15 మంది చనిపోగా.. మరో ఏడుగురు గాయాలు పాలయ్యారు. పంజాబ్‌లోని ఫైసలాబాద్‌లోని ఒక రసాయన కర్మాగారంలో ఒక బాయిలర్ పేలింది.
ఆపరేషన్ సిందూర్‌తో భారత సైన్యం సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. బీఎస్ఎఫ్ 61వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గుజరాత్‌లోని భుజ్‌లోని హరిపార్లోని జరిగిన కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం దేశ వ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం చేపట్టింది. మొట్టమొదటిగా వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే ఎన్నికల రాష్ట్రాలైన తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఈ ప్రత్యేక సర్వేను ఈసీ చేపట్టింది. మొదటి నుంచి విపక్షాలకు చెందిన పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.
తాను లౌకికవ్యక్తినని.. కానీ ప్రస్తుతం బౌద్ధమతాన్ని ఆచరిస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్.గవాయ్ అన్నారు. నవంబర్ 23న గవాయ్ పదవీ విరమణ చేయనున్నారు. శుక్రవారం (21-11-2025) గవాయ్‌ది చివరి పని దినం.
బంగ్లాదేశ్, కోల్‌కతాను భూప్రకంపనలు హడలెత్తించాయి. శుక్రవారం ఉదయం భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.7గా నమోదైంది. బంగ్లాదేశ్‌లోని నర్సింగ్డి నుంచి 14 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత ప్రధానంగా వినిపించిన పేరు ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయం. ఈ యూనివర్సిటీ కేంద్రంగానే ఉగ్ర డాక్టర్ల బృందం.. దేశ వ్యాప్త పేలుళ్లకు కుట్రపన్నారు. టెర్రర్ మాడ్యూల్ బయటపడిన కొన్ని గంటలకే నవంబర్ 10న ఢిల్లీ ఎర్రకోట దగ్గర కారు బ్లాస్ట్ జరిగింది.
దక్షిణాఫ్రికాలోని జోహాన్స్‌బర్గ్ వేదికగా జరుగుతున్న జీ20 లీడర్స్ సమ్మిట్‌కు ప్రధాని మోడీ శుక్రవారం ఉదయం బయల్దేరి వెళ్లారు. ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు దక్షిణాఫ్రికాలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో మోడీ ప్రసంగించనున్నారు.
ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయం కేంద్రంగా జరిగిన ఉగ్ర కుట్ర బయటపడింది. ఉగ్ర డాక్టర్ల బృందం ఉమర్, షాహీన్, ముజమ్మిల్ కలిసి దేశ వ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్ర పన్నారు.