COVID-19: హడలెత్తిస్తున్న కోవిడ్.. 4,302కు చేరిన కేసులు
- హడలెత్తిస్తున్న కోవిడ్
- ప్రస్తుతం 4,302కు చేరిన కేసులు
- 24 గంటల్లో ఐదుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో కరోనా విజృంభిస్తోంది. గత వారం కంటే ఈ వారం వేగంగా కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో ఐదుగురు చనిపోయారు. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఒక్కొక్కరు చనిపోగా.. మహారాష్ట్రలో ఇద్దరు చనిపోయారు. ఇక దేశ వ్యాప్తంగా 4, 302 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
ఇది కూడా చదవండి: Damodara Raja Narasimha : ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్.. రంగంలోకి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో కరోనాపై సంరక్షక మంత్రి గణేష్ నాయక్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కోవిడ్ మరణాల పెరగడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. గత 24 గంటల్లో దాదాపు 300 కొత్త ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. కేరళలో రోజువారీ కేసులు అత్యధికంగా నమోదవుతూనే ఉన్నాయని తెలిపింది.
ఇది కూడా చదవండి: Abhirami : 42 ఏళ్ల వయసులోనూ .. తరగని అందంతో అభిరామి..
రాష్ట్రాల వారీగా కేసులు..
గుజరాత్‌లో మంగళవారం 108 కొత్త కేసులు నమోదు కాగా.. ఒకరు చనిపోయారు. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 461కి చేరుకుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
మహారాష్ట్రలో 86 కొత్త కేసులు నమోదు కాగా.. నలుగురు చనిపోయారు. యాక్టివ్ ఇన్ఫెక్షన్ల సంఖ్య 510కి పెరిగింది. నాగ్‌పూర్, చంద్రపూర్, మిరాజ్ వంటి జిల్లాల్లో మరణాలు నమోదయ్యాయి.
దేశంలో అత్యధికంగా 1,446 యాక్టివ్ కేసులతో కేరళ అగ్రస్థానంలో కొనసాగుతోంది. తర్వాత మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ (393) కేసులు ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్‌లో 41 కొత్త ఇన్‌ఫెక్షన్లు, కోల్‌కతాలో ఒక మరణం చోటుచేసుకుంది. కోమోర్బిడిటీలతో బాధపడుతున్న 43 ఏళ్ల మహిళ చికిత్స పొందుతూ మరణించింది.
హర్యానాలో 16 కొత్త కేసులు నమోదయ్యాయి. గురుగ్రామ్, ఫరీదాబాద్‌లో ఎక్కువ ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పుడు యాక్టివ్ కేసులు 51గా ఉన్నాయి.
గత మూడు వారాల్లో ఆంధ్రప్రదేశ్‌లో 38 కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో రెండు కొత్త కేసులు నమోదయ్యాయి.
గ్వాలియర్ మరియు హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాలలో కూడా కొత్త కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రాలకు ఆరోగ్య శాఖ పలు సూచనలు
ప్రతి తాలూకాలో కోవిడ్ సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలి
బహిరంగ ప్రదేశాలు, తినుబండారాల క్రిమిసంహారక చర్య చేపట్టాలి
పాఠశాలల్లో పారిశుధ్యాన్ని పాటించాలి
పరిశుభ్రత, చేతులు కడుక్కోవడం, శానిటైజర్ల వాడకంపై సలహాలు ఇవ్వాలి
తాజావార్తలు
-
Afghanistan: ఆఫ్ఘాన్‌లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
-
Russia Sanctions Bill: రష్యా నుంచి చమురు కొంటే భారత్‌పై 100% టారిఫ్‌లు? అమెరికా హౌస్‌లో కీలక బిల్లు పాస్
-
Astrology: సెప్టెంబర్ 17 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధన లాభం..!
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!